Share News

శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది మహోత్సవాలు

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:09 AM

ద్వాదశ జ్యోతిర్లింగం.. శక్తిపీఠమైన శ్రీశైల మహా క్షేత్రంలో సోమవారం నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది మహోత్సవాలు

  • యాగశాల ప్రవేశంతో వేడుకలు ఆరంభం

శ్రీశైలం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ద్వాదశ జ్యోతిర్లింగం.. శక్తిపీఠమైన శ్రీశైల మహా క్షేత్రంలో సోమవారం నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. స్వామివారి యాగశాల ప్రవేశంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఈనెల 20వ తేదీ వరకు జరుగుతాయి. ఇందులో భాగంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు, విశేష అలంకరణలు, వాహన సేవలు, నిర్వహిస్తారు. మహోత్సవాలు జరిగే ఐదురోజుల పాటు గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు పూర్తిగా నిలుపుదల చేసి అందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నట్టు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

  • వాహనసేవలు, అలంకరణలు ఇలా..

  • 16వ తేదీన భృంగివాహన సేవ, మహాలక్ష్మి అలంకారం

  • 17న కైలాస వాహనసేవ, మహాదుర్గా అలంకారం

  • 18న ప్రభోత్సవం, నందివాహనసేవ, అగ్నిగుండ ప్రవేశం మహా సరస్వతి అలంకారం

  • 19న ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం, రథోత్సవం, రమావాణి సహిత రాజరాజేశ్వరి అలంకారం

  • 20న పూర్ణాహుతి, అశ్వవాహన సేవ, భ్రమరాంబదేవి నిజరూప అలంకారం, ఆలయోత్సవం.

Updated Date - Mar 16 , 2026 | 04:11 AM