Share News

మొబైల్ చూస్తోందని మందలించిన తండ్రి.. మనస్తాపానికి గురై బాలిక ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Apr 26 , 2026 | 07:52 AM

రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ ప్రాంతంలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తరచుగా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నందుకు తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసింది.

మొబైల్ చూస్తోందని మందలించిన తండ్రి..  మనస్తాపానికి గురై బాలిక ఆత్మహత్యాయత్నం
Attapur incident

రంగారెడ్డి జిల్లా, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): నేటి డిజిటల్ యుగంలో సెల్‌ఫోన్ వాడకం ప్రాణాంతకంగా మారుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు స్మార్ట్ ఫోన్లకు బానిసలవుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక ఘటన తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల బాలిక నిత్యం మొబైల్ ఫోన్ చూసేది. చదువును పక్కన పెట్టి ఫోన్‌లోనే కాలక్షేపం చేస్తోండటంతో.. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెను మందలించారు. తరచుగా మొబైల్ చూడటం వల్ల కళ్లు దెబ్బతింటాయని, చదువు పాడవుతుందని తండ్రి కాస్త గట్టిగానే హెచ్చరించారు.


మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం

తల్లిదండ్రులు తనను అందరిముందు తిట్టారని సదరు బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి, తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. లోపల ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కాసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలుకొట్టి చూడగా, బాలిక ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను కిందకుదించి చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.


బాలిక పరిస్థితి విషమం..

ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తమ కూతురు చిన్న విషయానికే ఇంత పెద్ద తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందని ఊహించని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అత్తాపూర్‌లో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 14 ఏళ్ల వయసులోనే బాలిక ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విచారకరమని కుటుంబ సభ్యులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఫిక్స్.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..

ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వ కీలక నిర్ణయం.. చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణరావు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 26 , 2026 | 08:53 AM