Share News

జీవన్ రెడ్డి ఎపిసోడ్‌పై మహేశ్ గౌడ్ రియాక్షన్

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:52 PM

మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.

జీవన్ రెడ్డి ఎపిసోడ్‌పై మహేశ్ గౌడ్ రియాక్షన్
Mahesh Kumar Goud

హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ చాలా చేసిందని ప్రస్తావించారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ 14 సార్లు బీ ఫాం ఇచ్చిందని గుర్తుచేశారు. ఈరోజు(గురువారం) గాంధీభవన్‌లో మీడియాతో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ప్రజలు ఎన్నుకున్న నేత సీఎం రేవంత్‌రెడ్డి అని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి పోవాలి.. మార్పు రావాలి అనడానికి జీవన్ రెడ్డి ఎవరు..? అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి గురించి అనేక సార్లు జీవన్ రెడ్డి విమర్శించారని మహేశ్ కుమార్ గౌడ్ ప్రస్తావించారు.


అవినీతిపై ఆధారాలు ఉంటే చర్చకు రావాలి..

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై వస్తున్న ఆరోపణలపై మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. పొంగులేటి అవినీతిపై ఆధారాలు ఉంటే చర్చకు రావాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఆధారాలు చూపిస్తే చర్యలు తప్పకుండా తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆధారాలు ఉంటే పట్టుకొని గాంధీ భవన్‌‌లో చర్చకు రావాలని సవాల్ విసిరారు. బట్ట కాల్చి మీద వేస్తామంటే కుదరదని హెచ్చరించారు. కేసీఆర్ హయాంలోని పదేళ్లలో అప్పటి మంత్రులు చాలా దోచుకున్నారని ఆరోపించారు. జేబులు నింపుకొని ఈరోజు తమ మంత్రులపై విమర్శలు చేస్తారా? అని ఆగ్రహించారు. ఆనాటి దోపిడీ గురించి కేసీఆర్ కూతురు కవిత చెబుతోందన్నారు. కేసీఆర్ హయాంలో నాసిరకం ప్రాజెక్టులు కట్టి డబ్బులు దోచుకున్నారని మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాళేశ్వరంపై విచారణ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై తీర్పును వాయిదా వేసిన హైకోర్టు

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోంది: కవిత

ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 09 , 2026 | 12:57 PM