Share News

హైదరాబాద్ సిటీలోని ప్రముఖ రెస్టారెంట్లలో టీజీ సేఫ్ సోదాలు.. లైసెన్స్‌ల రద్దు

ABN , Publish Date - Sep 26 , 2026 | 09:13 PM

హైదరాబాద్ నగరంలోని పలు ప్రముఖ రెస్టారెంట్లు, హోటల్స్‌‌లో టీజీ సేఫ్ తనిఖీలు నిర్వహించింది. ఈ మేరకు నిబంధనలను పాటించని 11రెస్టారెంట్ల లైసెన్సులను రద్దు చేసింది.

హైదరాబాద్ సిటీలోని ప్రముఖ రెస్టారెంట్లలో టీజీ సేఫ్ సోదాలు.. లైసెన్స్‌ల రద్దు
tg safe raids in hyderabad

హైదరాబాద్, సెప్టెంబర్ 26: నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీలలోని పలు రెస్టారెంట్లు, హోటల్స్‌పై టీజీ సేఫ్( తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్)తనిఖీలు నిర్వహించింది. ఈ మేరకు 11రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు చేసి.. వాటి కార్యకలాపాలు నిలిపివేయాని ఆదేశాలు జారీ చేసింది.


నగరంలోనే ప్రముఖమైనవిగా చెప్పుకునే ఈ రెస్టారెంట్లో వంట గదులు అత్యంత అపరిశుభ్రంగా ఉన్నాయని టీజీ సేఫ్ అధికారులు వెల్లడించారు. నాసిరకం ఆహారపదార్థాలను, ఈగలు, బొద్దింకలను గుర్తించినట్లు వారు తెలిపారు. ఈ మేరకు గచ్చిబౌలిలోని ఉడిపి ఉపహార్, శివాని బార్ అండ్ రెస్టారెంట్, ఆల్ సబ రెస్టారెంట్, అంతేరా కిచెన్ అండ్ బార్.. హైటెక్ సిటీలో మోనాస్ట్రీ, కోల్ స్పార్క్ రెస్టారెంట్, కాంచి కేఫ్‌.. మాదాపూర్‌లోని లక్కీ రెస్టారెంట్, సాయిరామ్‌ మెస్‌, ఇనార్బిట్ మాల్‌లోని అమ్ ఆహా తెలుగు కిచెన్ అండ్ బార్, ఫ్యూజన్ 9/అమ్నీషియా స్కై బార్ ల లెసెన్సులు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు

రూ.39 లక్షలు పలికిన బాలాపూర్ లంబోదరుడి లడ్డూ

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపయ్య

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 09:45 PM