ఎల్‌నినో ముప్పుపై తెలంగాణ సర్కార్ అలర్ట్.. కేంద్ర ఆర్థిక సాయం కోరనున్న ప్రభుత్వం
ABN , Publish Date - Nov 13 , 2026 | 03:23 PM
ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. ఈరోజు సచివాలయంలో ఎల్‌నినో ప్రభావంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, నవంబర్ 13: ఎల్‌నినో ముప్పును ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. ఈరోజు(శుక్రవారం) సచివాలయంలో ఎల్‌నినో ప్రభావంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాల పరిస్థితిపై అధికారులతో సమీక్షించి కీలక ఆదేశాలను జారీ చేశారు. తెలంగాణలో ఎల్‌నినో పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ఆర్థిక సాయం కోరుతామని తెలిపారు. భూగర్భ జలమట్టాలపై నిరంతర పర్యవేక్షణకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
జలమట్టాలు తగ్గుతున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని.. వర్షపు నీటి సంరక్షణకు తక్షణ, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. జల సంరక్షణ చర్యలపై అధికారుల నుంచి పలు సూచనలను మంత్రి సేకరించారు. మరోవైపు హైదరాబాద్‌లో నీటి సంక్షోభం ముంచుకొస్తోంది. మరో 40 నుంచి 45 వరకే నగరానికి మంజీరా, సింగూరు జలాల సరఫరా జరగనుంది. ఈ జలాలు నిలిచిపోతే వంద ఎంజీడీల నీటి సరఫరా బంద్ కానుంది. దీంతో నీటి కొరతను బర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై వాటర్ బోర్డు ఫోకస్ పెట్టింది.
ఇవి కూడా చదవండి...
రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై కేటీఆర్ ఫైర్.. రూ.100 కోట్ల ఖర్చుపై ప్రశ్నలు
కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కెనాల్ ఉందా? దర్యాప్తు చేయాలంటూ కవిత డిమాండ్
Read Latest Telangana News And Telugu News