Share News

ఏపీకి రూ.1.41 లక్షల కోట్ల పెట్టుబడులు..10,919 మందికి ఉద్యోగాలు

ABN , Publish Date - Nov 13 , 2026 | 03:06 PM

రెండో రోజు సీఐఐ సదస్సులో ఏపీ ప్రభుత్వంతో పలు దిగ్గజ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. సీఎం చంద్రబాబు సమక్షంలో 12 కీలక ఎంఓయూలు కుదిరాయి.

ఏపీకి రూ.1.41 లక్షల కోట్ల పెట్టుబడులు..10,919 మందికి ఉద్యోగాలు
Andhra Pradesh Investments

అమరావతి/విశాఖపట్నం, నవంబర్ 13: రెండో రోజు సీఐఐ సదస్సులో ఏపీ ప్రభుత్వంతో పలు దిగ్గజ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. సీఎం చంద్రబాబు సమక్షంలో 12 కీలక ఎంఓయూలు కుదిరాయి. దాదాపు రూ.1,41,585 కోట్ల భారీ పెట్టుబడులు ఏపీకి రాగా.. 10,919 మందికి కొత్తగా ఉద్యోగాలు లభించనున్నాయి. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, మైనింగ్, పోర్టులు, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఎంఓయూలు చేసుకోవడమే కాదు, ప్రాజెక్టుల గ్రౌండింగ్‌పై సంస్థలు దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు సూచించారు.


కంపెనీల వారీగా:

  • ఎయిర్ ట్రంక్-జేసీకే ఇన్‌ఫ్రా భారీ పెట్టుబడి: డేటా, టెలికాం సెంటర్ల కోసం రూ.1.03 లక్షల కోట్లు

  • ప్రకాశం జిల్లా కందుకూరులో రూ.15 వేల కోట్లతో జిందాల్ గ్రూప్ మైనింగ్ ప్రాజెక్ట్.. 2,500 మందికి ఉపాధి

  • ఏపీ పునరుత్పాదక ఇంధన రంగంలో ఇండియన్ ఆయిల్ రూ.6,600 కోట్లు, గ్రీన్ జెన్ రూ.8 వేల కోట్ల పెట్టుబడులు

  • కాకినాడ పోర్టులో రూ.6,452 కోట్లతో డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు చేపట్టనున్న కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్

  • ఏపీలో డిక్సన్ టెక్నాలజీస్ రూ.700 కోట్ల పెట్టుబడి.. కొత్తగా 2,300 మందికి ఉపాధి అవకాశాలు

  • తిరుపతిలో రాకెట్ ఫ్యాక్టరీ: రూ.510 కోట్ల పెట్టుబడితో అగ్నికుల్ కాస్మోస్ ఒప్పందం

  • రాజధాని అమరావతిలో ఒబెరాయ్ హోటల్ ఏర్పాటు.. రూ.175 కోట్లతో ఒప్పందం చేసుకున్న ఈఐహెచ్ లిమిటెడ్

  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టనున్న హాథోర్ రాకెట్ ప్రైవేట్ లిమిటెడ్


పీ4కు భారీ మద్దతు

ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమానికి ఐటీసీ, హీరో మోటార్స్ కార్ప్ సంస్థలు చేయూతనిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల ‘బంగారు కుటుంబాల’ను ఐటీసీ లిమిటెడ్ దత్తత తీసుకుంది. 1,120 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు హీరో మోటార్స్ అండగా నిలిచింది. రూ.32.48 కోట్లతో స్కాలర్‌షిప్‌లను అందజేసింది. పీ4 కార్యక్రమానికి సహకరిస్తున్న ఐటీసీ, హీరో మోటార్స్ కార్పొరేషన్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌కు బిల్ గేట్స్‌ను నేనే రప్పించా.. ఆనాడే ఐటీపై ఫోకస్ పెట్టా: సీఎం చంద్రబాబు

ఏపీకి మరో రూ.700 కోట్ల పెట్టుబడులు.. 2,300 మందికి డిక్సన్‌లో ఉద్యోగాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 13 , 2026 | 03:10 PM