Share News

ఏపీకి మరో రూ.700 కోట్ల పెట్టుబడులు.. 2,300 మందికి డిక్సన్‌లో ఉద్యోగాలు

ABN , Publish Date - Nov 13 , 2026 | 01:33 PM

ఏపీలో మరో రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు డిక్సన్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. రెండో రోజు సీఐఐ సదస్సులో డిక్సన్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ పంకజ్ శర్మతో మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు.

ఏపీకి మరో రూ.700 కోట్ల పెట్టుబడులు.. 2,300 మందికి డిక్సన్‌లో ఉద్యోగాలు
Minister Nara lokesh

అమరావతి/ విశాఖపట్నం, నవంబర్ 13: ఏపీలో మరో రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు డిక్సన్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. రెండో రోజు సీఐఐ సదస్సులో డిక్సన్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ పంకజ్ శర్మతో మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. తిరుపతి EMC-IIలో డిక్సన్ కొత్త పెట్టుబడితో 2,300 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే కొప్పర్తిలో రూ.450 కోట్లతో డిక్సన్ విస్తరణ ద్వారా.. దాదాపు 7వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఏపీలో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ తయారీ యూనిట్ కూడా ఏర్పాటు చేయాలని లోకేశ్ ఆహ్వానం పలికారు.


సాగర్ డిఫెన్స్ ఫౌండర్ కెప్టెన్‌తో లోకేశ్ భేటీ

nikunj-lokesh.jpg

సాగర్ డిఫెన్స్ ఫౌండర్ కెప్టెన్ నికుంజ్ పరాశర్‌తో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీలో ‘మారిటైమ్ అటానమీ, రోబోటిక్స్ స్కిల్లింగ్ సెంటర్’ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి వినతి చేశారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెను డ్రోన్లు, మానవరహిత నౌకల ఎక్స్‌పోర్ట్ హబ్‌గా మార్చాలని ప్రతిపాదించారు. ఏపీకి డ్రోన్ల తయారీ (ఎండ్యూర్ ఎయిర్) యూనిట్‌తో పాటు, కాంపోజిట్స్, బ్యాటరీల సప్లయర్లను నెల్లూరుకు రప్పించాలని లోకేశ్ కోరారు.


ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఎండీ‌తో ప్రత్యేక సమావేశం

shashwat-lokesh.jpg

ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఎండీ శాశ్వత్ గోయంకాతో మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అమరావతిలో భారీ ‘స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీ’ ఏర్పాటు చేయాలని ఆర్‌పీఎస్‌జీకి మంత్రి వినతి చేశారు. మంగళగిరిలో లగ్జరీ వస్త్రాల తయారీ, డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆహ్వానం పలికారు. విజయవాడలో ఫస్ట్ సోర్స్ ఐటీ కార్యకలాపాల విస్తరణ.. విశాఖ, తిరుపతిలో కొత్త ఆఫీసుల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఏపీలో సోలార్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను మరింత విస్తరించాలని ఆర్‌పీఎస్‌జీకి మంత్రి లోకేశ్ సూచించారు.


ఇవి కూడా చదవండి...

P4కు కార్పొరేట్ చేయూత.. 25 వేల కుటుంబాలను దత్తత తీసుకున్న ఐటీసీ

హైదరాబాద్‌కు బిల్ గేట్స్‌ను నేనే రప్పించా.. ఆనాడే ఐటీపై ఫోకస్ పెట్టా: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 13 , 2026 | 01:40 PM