ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:31 PM
ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు (శుక్రవారం) విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి, నవంబర్ 13: ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు (శుక్రవారం) విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. తొలి దశలో 26 జిల్లాల్లోని 201 మండలాల్లో ఉన్న పలు గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 15న ఎన్నికల నోటీసు జారీ, వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శన ప్రక్రియలు ఉండనున్నాయి. నవంబర్ 15 ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నవంబర్ 17 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు ఆఖరు గడువని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. నవంబర్ 18 ఉదయం 8 గంటల నుంచి నామినేషన్లను పరిశీలిస్తామని తెలిపింది. నవంబర్ 19 సాయంత్రం 5 గంటల వరకు తిరస్కరించిన నామినేషన్లపై అప్పీలుకు అవకాశం కల్పిస్తామని వివరించింది. నవంబర్ 21 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువని వెల్లడించింది.
కాగా నవంబర్ 21 మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన రానుంది. నవంబర్ 26 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తొలి విడత పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి, ఎన్నికల అధికారులు ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాలు ప్రకటించిన రోజే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉండబోతోంది. ఒకవేళ రీపోలింగ్ అవసరమైతే నవంబర్ 27 ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది.
ఈ వార్తలూ చదవండి
రాప్తాడు బాలిక కోలుకుంది: లోకేశ్
ఐటీ శకం ముగుస్తోంది.. ఏఐ, క్వాంటం శకం మొదలైంది: సీఎం చంద్రబాబు