Share News

రాప్తాడు బాలిక కోలుకుంది: లోకేశ్‌

ABN , Publish Date - Nov 13 , 2026 | 05:17 AM

‘రాప్తాడు బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. గతంకన్నా బాగా కోలుకుంది’ అని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. ఆయన ఎక్స్‌లో బాలిక ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేశారు.

రాప్తాడు బాలిక కోలుకుంది: లోకేశ్‌

‘రాప్తాడు బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. గతంకన్నా బాగా కోలుకుంది’ అని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. ఆయన ఎక్స్‌లో బాలిక ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేశారు. ‘కృత్రిమ ఆక్సిజన్‌ అవసరం లేకుండా ఆమె శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిలు బాగున్నాయి. ప్రస్తుతం మెత్తని ఆహారాన్ని తీసుకుంటోంది. ఇతరుల సాయంతో మెల్లగా అడుగులు వేయడం ప్రారంభించింది.

బాలిక ముఖానికి వేసిన కుట్లు తొలగించారు. ఛాతీలోని ద్రవాలను బయటకు పంపే గొట్టం(చెస్ట్‌ డ్రెయిన్‌) ద్వారా వచ్చే స్రావాలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. తన జీవితంలో అతి క్లిష్టమైన సమయాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న బాలిక త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నా’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 05:20 AM