Share News

తెలంగాణలో వ్యవసాయ సంస్కరణలకు జాతీయస్థాయి గుర్తింపు

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:45 PM

వ్యవసాయరంగంలో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. SASCI (స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్) పథకం కింద కేంద్రం నుంచి అత్యధిక నిధులు పొందిన తొలి రాష్ట్రంగా నిలిచింది.

తెలంగాణలో వ్యవసాయ సంస్కరణలకు జాతీయస్థాయి గుర్తింపు
telangana sasci funds

హైదరాబాద్, నవంబర్ 18: కేంద్ర నిధుల సాధనలో తెలంగాణ అరుదైన ఘనత సాధించింది. SASCI పథకం కింద కేంద్రం నుంచి వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు పొందిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ సందర్భంగా వ్యవసాయరంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలే ఈ ఘనత సాధించడానికి కారణమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సమిష్టి కృషికి దక్కిన గుర్తింపుగా దీనిని అభివర్ణించారు.


మౌలిక సదుపాయాలు, మూలధన పెట్టుబడులు, సంస్కరణలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం SASCI (స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్) పథకం కింద ఆర్థికసాయం చేస్తుంది. ఈ నిధులను సాధించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ. 1,087.64 కోట్ల ప్రత్యేక ఆర్థికసాయాన్ని అందించింది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగంలో చేపట్టిన సంస్కరణలకు ప్రోత్సాహకంగా.. కేంద్రం ఈ నిధులను మంజూరు చేసింది. ఫార్మర్ రిజిస్ట్రీ, ఎరువుల పంపిణీలో సమర్థవంతమైన విధాలను ప్రోత్సహిస్తూ.. కేంద్రం రూ. 422.64 కోట్ల నిధులను విడుదల చేయగా.. ఎరువుల పంపిణీ విధానంలో సంస్కరణల అమలుకు రూ. 665 కోట్ల ప్రోత్సాహక నిధులను విడుదల చేసింది.


ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ‘ SASCI పథకం కింద కేంద్రం.. తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక ఆర్థిక సాయం అందించడం చాలా సంతషంగా ఉంది. ఇది వ్యవసాయ అధికారుల కృషికి దక్కిన గుర్తింపు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేపట్టిన సంస్కరణలకు గుర్తింపు. ఫెర్టిలైజర్ సేల్స్ సిస్టమ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో అమలవుతోంది. ఎరువుల కొనుగోలును ఫార్మర్ ఐడీ సులభతరం చేసింది. ఎరువుల కోసం గంటల తరబడి క్యూలైన్స్‌లో నిలబడే కష్టాలకు చెక్ పెట్టింది. దీని ద్వారా యాసంగి సీజన్‌లోనూ రైతులకు సులభంగా ఎరువులను సరఫరా చేస్తున్నాం. కనీస మద్దతు ధరపై పంటలను విక్రయించడంలో ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ ఎంతగానో ఉపయోగపడుతోంది. రైతుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం ఎల్లప్పుడూ పాటుపడుతుంది’ అని తుమ్మల పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచే అభ్యర్ధులనే గెలిపించాలి: ప్రజలకు కూటమి నేతలు పిలుపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 05:54 PM