Share News

మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ABN , Publish Date - Nov 18 , 2026 | 03:48 PM

మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మునుగోడు అభివృద్ధికి నిధులు ఆపితే మరో కురుక్షేత్రం సృష్టిస్తానంటూ రేవంత్ సర్కార్‌ను హెచ్చరించారు.

మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
TG Congress MLA Komatireddy Raj Gopal Reddy

నల్గొండ, నవంబర్18: మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మునుగోడు అభివృద్ధికి నిధులు ఆపితే మరో కురుక్షేత్రం సృష్టిస్తానంటూ రేవంత్ సర్కార్‌ను హెచ్చరించారు. మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయిందంటూ ఉపఎన్నికపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం ఎవరి ఇంటి చుట్టూ తాను తిరగనని కండబద్దలు కొట్టారు. బుధవారం నల్గొండలో ఆయన మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవి ఇవ్వకున్నా ఫర్వాలేదు కానీ అభివృద్ధికి నిధులు ఇవ్వండంటూ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. మునుగోడు ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే.. అక్కడ ఈ రాజగోపాల్ రెడ్డి ఉంటాడని అన్నారు. మునుగోడుకు సాగు నీరు తీసుకొచ్చి 3 లక్షల ఎకరాల ఆయుకట్టుకు నీరు అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.


నువ్వేమి ముఖ్యమంత్రివి నీదేమీ భాష..

ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి .. తన సొంత నియోజకవర్గం కొడంగల్ అని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర అని, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ అని అంటారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కొడంగల్‌కి రూ. పది వేల కోట్ల కాకపోతే రూ. 20 వేల కోట్ల తీసుకెళ్లు కానీ.. మునుగోడుకి నిధులు అడిగితే ఆగ్రహం వ్యక్తం చేస్తావా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి నిప్పులు చెరిగారు. నువ్వేమి ముఖ్యమంత్రివి నీదేమీ భాష అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నది తమ ఆకాంక్ష అని ఈ సందర్భంగా కోమటిరెడ్డి పునరుద్ఘాటించారు.


ఉన్నది ఉన్నట్లు మాట్లాడడమే తన నైజం..

రైతుబంధు నిజమైన వ్యవసాయం చేసే రైతులకు ఇవ్వాలని ప్రభుత్వానికి ఎమ్మెలే రాజగోపాల్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో ఉండి ఉద్యోగం చేసుకునే వాళ్ళకే ఇస్తున్నారని విమర్శించారు. దీని వల్ల కౌలు రైతులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వానికి తాను కేవలం సూచన చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే తాను మెచ్చుకుంటానని అన్నారు. అయితే ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం తన నైజమని స్పష్టం చేశారు. అలా మాట్లాడడం విమర్శలు చేసున్నట్టు కాదని పేర్కొన్నారు.


రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి మాట్లాడితే తప్పా, ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రతిపక్షంలో ఉండాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసం రూ. లక్షల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉన్న కాంటాక్టర్లు ఇప్పుడు కొనసాగుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పు మనం చేయొద్దంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హితవు పలికారు.


గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కట్టడమే మనకు సరిపోతుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్న సిటీకి గతి లేదు కానీ ప్యూచర్ సిటీ ఎందుకు అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. మొదట ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చురకలంటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

4.63 లక్షల మందికి పెన్షన్లు.. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక: మంత్రి సీతక్క

పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచే అభ్యర్ధులనే గెలిపించాలి: ప్రజలకు కూటమి నేతలు పిలుపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 04:05 PM