Share News

4.63 లక్షల మందికి పెన్షన్లు.. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక: మంత్రి సీతక్క

ABN , Publish Date - Nov 18 , 2026 | 02:28 PM

తెలంగాణలో 4.63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ పెన్షన్ లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తున్నామని తెలిపారు.

4.63 లక్షల మందికి పెన్షన్లు.. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక: మంత్రి సీతక్క
TG Minister Seethakka

వరంగల్, నవంబర్18: రాష్ట్రంలో 4.63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలంగాణ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ పెన్షన్ లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తున్నామని తెలిపారు. బుధవారం వరంగల్ జిల్లా సంగెం మండలం స్టేషన్ చింతలపల్లి టెక్స్‌టైల్ పార్క్ పైలాన్ వద్ద రూ. 45 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ పత్రాలను ఆమె పంపిణీ చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇంట్లో ఆడ కూతురు సంతోషంగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆరాటమని చెప్పారు. మహిళా సంఘాలకు మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ ఇస్తామని తెలిపారు.


ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులతోపాటు పథకాలన్నీ మహిళల పేరు మీదే ఇస్తున్నామని మంత్రి సీతక్క వివరించారు. కేవలం ఈ మూడేళ్లలో మహిళా సంఘాలకు రూ.75 వేల కోట్లు రుణాలు ఇచ్చామని గుర్తు చేశారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా పెట్రోల్ బంక్, సోలార్ పవర్ ప్లాంట్స్‌తోపాటు 300 ప్రాంతాల్లో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు ఇచ్చామని అన్నారు.


మేడారం జాతరలో వ్యాపారాల కోసం మహిళా సంఘాలకు రూ.3 కోట్లు ఇస్తే.. వారు రూ.9 కోట్లు సంపాదించారని సోదాహరణంగా మంత్రి సీతక్క వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఏఎం (HAM) ప్రాజెక్టు కింద రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సభలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎంపీ కడియం కావ్య, గ్రంథాలయం సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, కలెక్టర్ సత్య శారదతోపాటు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం

బాబా బర్త్‌డే స్పెషల్‌.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 03:01 PM