తెలంగాణకు వర్ష సూచన.. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు
ABN , Publish Date - Oct 04 , 2026 | 09:12 AM
తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
హైదరాబాద్, అక్టోబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.
వర్షకాల ముగింపు సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు తెలియజేశారు. పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News