Share News

మ్యూల్ అకౌంట్లపై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం.. వేల ఖాతాలకి పోలీసుల చెక్

ABN , Publish Date - Feb 25 , 2026 | 07:38 PM

తెలంగాణ పోలీసులు ఆపరేషన్ క్రాక్‌డౌన్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సైబర్ క్రైమ్‌పై 16 జిల్లాల్లో ఒకేసారి ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు. మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఫోకస్ పెట్టారు.

మ్యూల్ అకౌంట్లపై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం.. వేల ఖాతాలకి పోలీసుల చెక్
Telangana Police

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీసులు (Telangana Police) ఆపరేషన్ క్రాక్‌డౌన్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సైబర్ క్రైమ్‌పై 16 జిల్లాల్లో ఒకేసారి ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఫోకస్ పెట్టారు. 2025లో రాష్ట్రంలో 4,775 మ్యూల్ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈరోజు(బుధవారం) జరిపిన ఆపరేషన్‌లో 1,888 అనుమానాస్పద ఖాతాలకు సైబర్ సెక్యూరిటీ అధికారులు బ్యూరో చెక్ పెట్టారు. ఈ క్రమంలోనే 137 బ్యాంక్ బ్రాంచ్‌ల్లో సోదాలు చేశారు. దేశవ్యాప్తంగా 9,431 క్రైమ్ లింకులు ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణలోనే 782 కేసులతో మ్యూల్ అకౌంట్లకు ఈ సంబంధం ఉందని వివరించారు.


137 పోలీస్ టీమ్స్ 512 మంది సిబ్బందితో ఈ సోదాలు నిర్వహించారు. కొన్ని బ్రాంచ్‌ల్లో వందల సంఖ్యలో మ్యూల్ ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. సుల్తాన్ బజార్‌లో ఒకే అకౌంట్‌కు 496 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. సూర్యాపేటలో 4 బ్రాంచ్‌లలో 298 అనుమానాస్పద ఖాతాలు, చిన్న బ్యాంకులు RTGS కోసం నేషనల్ బ్యాంకుల సిస్టమ్ వినియోగించినట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. సరైన వెరిఫికేషన్ లేకపోవడంతో సైబర్ నేరగాళ్ల మ్యూల్ అకౌంట్స్‌తో దందాలకు పాల్పడుతున్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం..

ఆ చిన్నారి ఘటన మానవత్వానికే మాయనిమచ్చ: కేటీఆర్‌

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 25 , 2026 | 07:42 PM