Share News

ఓంకారేశ్వరాలయానికి.. రూ.948.65 కోట్లు

ABN , Publish Date - Oct 08 , 2026 | 04:12 AM

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో నిర్మించనున్న శ్రీ ఓంకారేశ్వర ఆలయ సముదాయ నిర్మాణానికి, దానిని కలిపే ఆరు లేన్ల రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,108.27 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చింది.

ఓంకారేశ్వరాలయానికి.. రూ.948.65 కోట్లు
Omkareshwar Temple

  • మంచిరేవులలో ఆలయ సముదాయం,

  • రోడ్డు నిర్మాణానికి కలిపి రూ.1,108.27 కోట్లు మంజూరు

  • నిర్మాణానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చైర్మన్‌గా ఆర్‌ అండ్‌ బీ చీఫ్‌ ఇంజనీర్‌

హైదరాబాద్‌/నార్సింగి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో నిర్మించనున్న శ్రీ ఓంకారేశ్వర ఆలయ సముదాయ నిర్మాణానికి, దానిని కలిపే ఆరు లేన్ల రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,108.27 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఆలయ సముదాయానికి రూ.948.65 కోట్లు, రోడ్డు నిర్మాణానికి రూ.159.62 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు మెట్రోపాలిటన్‌ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ బుధవారం జీవో జారీ చేసింది. మూసీ నది ఒడ్డున గల చారిత్రక శ్రీ వీరభద్ర స్వామి ఆలయం పక్కన ఓంకారేశ్వర ఆలయ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.


ఓంకారేశ్వర ఆలయంతోపాటు ఉప ఆలయాలుగా శ్రీ వీరభద్రుడు, భద్రకాళి, లలితా త్రిపురసుందరి, బాలగణపతి, బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను కూడా నిర్మించనున్నారు. మహామండపం, నంది మండపం, ప్రాకారాలు, రాజగోపురం, యాగశాల, పుష్కరిణి, భారీ మహాశివుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయననాఆ్నరు. ఓంకారేశ్వర ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఆర్‌ అండ్‌ బీ చీఫ్‌ ఇంజనీర్‌ చైర్మన్‌గా, పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కో చైర్మన్‌గా, ఎంఆర్‌డీసీఎల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కన్వీనర్‌గా, ఎండోమెంట్‌ చీఫ్‌ ఇంజనీర్‌ సభ్యునిగా, డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి స్థపతి సభ్యునిగా, ప్రభుత్వ అడిషనల్‌ సెక్రటరి ఫైనాన్స్‌ను మరో సభ్యునిగా నియమించారు. దేవాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ అధికారుల బృందం ప్రత్యేక కమిటీగా పనిచేస్తుంది. ఈ మేరకు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరి జయేశ్‌ రంజన్‌ జీవో జారీ చేశారు.


గతంలో రూ.700 కోట్లతో అంచనా

సీఎం రేవంత్‌ రెడ్డి ఈ ఏడాది మార్చి 28న మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ పునర్నిణానికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో 8 ఎకరాల్లో రూ.700 కోట్ల అంచనాతో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. తాజాగా ఆలయ నిర్మాణానికి రూ.948.65 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...
రాహుల్‌ పోరాటంతో కేంద్రంలో వణుకు

ఆ 45 ఎకరాలు ఎక్కడ!?

బతికున్న భార్య ఓటును తొలగించాలని.. మరణించిన భర్త దరఖాస్తు!
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 04:12 AM