ఇండిగో విమానంపై పిడుగు
ABN , Publish Date - Oct 08 , 2026 | 03:35 AM
పట్నా నుంచి లఖ్‌నవూ బయలుదేరిన ఇండిగో విమానానికి బుధవారం పెను ప్రమాదం తప్పింది.
దెబ్బతిన్న ముక్కు భాగం
పట్నా, అక్టోబరు 7: పట్నా నుంచి లఖ్‌నవూ బయలుదేరిన ఇండిగో విమానానికి బుధవారం పెను ప్రమాదం తప్పింది. సుమారు 17,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా పిడుగుపాటుకు గురైంది. ఈ ప్రమాదంలో విమానం ముందు భాగం (ముక్కు భాగం) ధ్వంసమైంది. వెంటనే అప్రమత్తమైన పైలట్ అత్యవసరంగా లఖ్‌నవూ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
అదుపులోకి రాహుల్ గాంధీ, ప్రియాంక.. నేలపై పడుకొని ప్రియాంక నిరసన.
యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు.