Share News

అదుపులోకి రాహుల్ గాంధీ, ప్రియాంక.. నేలపై పడుకొని ప్రియాంక నిరసన..

ABN , Publish Date - Oct 07 , 2026 | 06:20 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి చేపట్టిన నిరసన మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జంతర్ మంతర్ వైపు వెళ్తున్న ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

అదుపులోకి రాహుల్ గాంధీ, ప్రియాంక.. నేలపై పడుకొని ప్రియాంక నిరసన..
Jantar Mantar protest

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి చేపట్టిన నిరసన మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జంతర్ మంతర్ వైపు వెళ్తున్న ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రియాంక సహా పలువురు మహిళా నేతలు, కార్యకర్తలో నేలపై పడుకొని నిరసన తెలిపారు (Rahul, Priyanka detained).


ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను రద్దు చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్లతో బుధవారం జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో సాగర్ రత్నలో లంచ్ సమావేశం అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీలు జంతర్ మంతర్ వైపు బయలుదేరారు. జంతర్ మంతర్‌కు సుమారు 100 మీటర్ల ముందు ప్రతిపక్ష ఎంపీలు ప్రయాణిస్తున్న బస్సులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీలు బస్సుల నుంచి బయటకు వచ్చి నిరసనకు దిగారు (Jantar Mantar protest).


కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు బస్సుల పైకి ఎక్కి నినాదాలు చేశారు (INDIA bloc protest). ప్రియాంక గాంధీ కూడా రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో నిరసన ప్రదేశం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరసన కొనసాగుతున్న సమయంలో పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు రోజుల్లో రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇది మూడోసారి.


ఇవి కూడా చదవండి..

రాహుల్ గాంధీ సర్‌ప్రైజ్ ట్రిక్.. పోలీసుల ప్లాన్‌ను ఎలా మార్చారు..


యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Oct 07 , 2026 | 06:55 PM