నాపై 45 ఎఫ్‌ఐఆర్‌లు.. ఒక్కో కేసు ఒక్కో మెడల్: రాహుల్ గాంధీ
ABN , Publish Date - Oct 07 , 2026 | 04:21 PM
తనపై ఇప్పటివరకు 45 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, వాటిలో ప్రతి ఒక్కదాన్నీ తాను మెడల్‌గా భావిస్తానని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి చేపట్టిన నిరసనల నేపథ్యంలో రాహుల్ మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: తనపై ఇప్పటివరకు 45 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, వాటిలో ప్రతి ఒక్కదాన్నీ తాను మెడల్‌గా భావిస్తానని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి చేపట్టిన నిరసనల నేపథ్యంలో రాహుల్ మాట్లాడారు. తనపై నమోదైన కేసులకు తాను భయపడబోనని చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణపై తమ అభ్యంతరాలను ఎన్నికల సంఘం వినాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్ష ఎంపీలు అక్టోబర్ 6న పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వైపు మార్చ్ చేపట్టారు (Rahul Gandhi FIRs).
మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఆకాశవాణి భవన్ వద్ద ఎంపీలు బైఠాయించి దాదాపు ఎనిమిది గంటలపాటు నిరసనను కొనసాగించారు. అనుమతి లేకుండా ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి ప్రవేశించారనే కారణంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు మరికొందరిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే తనపై కేసుల గురించి రాహుల్ గాంధీ స్పందించారు. తనపై నమోదయ్యే ఒక్కో ఎఫ్‌ఐఆర్ తనకు ఒక్కో మెడల్‌తో సమానమని అన్నారు (Rahul Gandhi 45 FIRs).
తనపై ఇప్పటికే 45 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని, అవి 100కు చేరాలని కోరుకుంటున్నానని రాహుల్ అన్నారు (Rahul Gandhi EC protest). హక్కుల కోసం పోరాడతానని, ఎఫ్‌ఐఆర్‌లకు భయపడనని వ్యాఖ్యానించారు. సుమారు 300 మంది లోక్‌సభ ఎంపీలు మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను కలవాలనుకున్నారని, అయితే వారికి ఆ అవకాశం కల్పించలేదని అన్నారు. 'ఈరోజు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టాలనేది మా ప్రణాళిక. జ్ఞానేష్ కుమార్ చట్టబద్ధమైన సీఈసీ కాదని మేము దేశానికి చెప్పాలనుకుంటున్నాము. వీరు దేశద్రోహులు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి' అని రాహుల్ గాంధీ అన్నారు.
ఇవి కూడా చదవండి..
రాహుల్ గాంధీ సర్‌ప్రైజ్ ట్రిక్.. పోలీసుల ప్లాన్‌ను ఎలా మార్చారు..
యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..