సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:47 PM
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్ అన్నారు.
- ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్
నాగర్‌కర్నూల్‌క్రైం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యో తి) : సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్ అన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు సైబర్ జాగృత దివస్ సందర్భంగా ఎస్పీ కార్యాల యంలో బుధవారం సైబర్ క్రైమ్ పోస్టర్లను ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్ విడుదల చే శారు. జిల్లాలోని బ్యాంకర్స్, వివిధ అసోసి యేషన్ సభ్యులను, సైబర్ క్రైమ్ బాధితులకు పలు సూచనలు చేశారు. అలాగే సైబర్ బారిన పడిన వారిని పిలిపించి వారు ఎలా మోసపో యారనే సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సాంకేతికత పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయని, ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్ర మంలో అడిషనల్ ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, సైబ ర్ క్రైమ్ ఎస్‌ఐ గిరిమనోహర్‌రెడ్డి, స్పెషల్ బ్రాం చ్ ఎస్‌ఐ రాంలాల్, డీసీఆర్‌బీ ఎస్‌ఐ రమేష్, సి బ్బంది, జిల్లా సైబర్ క్రైం టీం సభ్యులు రవికు మార్, తేజశ్రీ, స్వాతి పాల్గొన్నారు.