Share News

ఇరాన్‌ యుద్ధంతో ‘పెద్దన్న’కు భారీ నష్టం

ABN , Publish Date - Oct 08 , 2026 | 03:23 AM

ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా భారీగా నష్టపోయింది. 3.3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.31,700 కోట్లు) విలువైన 81 యుద్ధ విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్‌లను కోల్పోయింది. ఫలితంగా ప్రపంచానికి పెద్దన్నగా భావించే అమెరికా యుద్ధ సామర్థ్యాలపై పెద్ద దెబ్బపడింది.

ఇరాన్‌ యుద్ధంతో  ‘పెద్దన్న’కు భారీ నష్టం
AMERICA

  • రూ.31 వేల కోట్ల నష్టంగా అంచనా

  • కాంగ్రెషనల్‌ రిసెర్చ్‌ సర్వీస్‌ నివేదిక వెల్లడి

న్యూడిల్లీ, అక్టోబరు 7: ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా భారీగా నష్టపోయింది. 3.3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.31,700 కోట్లు) విలువైన 81 యుద్ధ విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్‌లను కోల్పోయింది. ఫలితంగా ప్రపంచానికి పెద్దన్నగా భావించే అమెరికా యుద్ధ సామర్థ్యాలపై పెద్ద దెబ్బపడింది. అంతేగాక దెబ్బతిన్న విమానాల మరమ్మతులకు అగ్రరాజ్య మిలిటరీపై భారీగా ఆర్థిక భారం కూడా పడింది. ఇరాన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి యూఎస్‌ కోల్పోయిన ఆయుధాల వివరాలను కాంగ్రెషనల్‌ రిసెర్చ్‌ సర్వీస్‌ (సీఆర్‌ఎస్‌) నివేదిక తాజాగా వెల్లడించింది. అమెరికా నష్టపోయిన వాటిలో 12 ఎఫ్‌-15ఈ స్ట్రైక్‌ ఈగల్‌ ఫైటర్‌ జెట్లు, ఒక ఎఫ్‌-35ఏ లైట్నింగ్‌-2 స్టెల్త్‌ ఫైటర్‌, ఒక ఈ-3 సెంట్రీ నిఘా విమానం, డజన్ల కొద్దీ ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్లు ఉన్నాయి. ఈ యుద్ధంలో ఇవి కీలకమైన పాత్ర పోషించాయి. ఒక్కోటి 30 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 290 కోట్లు) విలువైన మూడు ఎఫ్‌-15ఈ ఫైటర్లు మార్చి 2న కువైత్‌లో ధ్వంసం కాగా, మరొక విమానాన్ని ఏప్రిల్‌లో తమ గగనతలంపై ఇరాన్‌ కూల్చివేసింది. మరో 8 ఎఫ్‌-15ఇలు సెప్టెంబరు 8, 9 తేదీల్లో జోర్డాన్‌లోని ఎయిర్‌బే్‌సపై ఇరాన్‌ దాడులతో స్వల్పంగా ధ్వంసం కాగా, వాటికి మరమ్మతులు చేస్తున్నారు. ఇక 45 ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్లను అమెరికా కోల్పోయింది. ఒక్కో రీపర్‌ డ్రోన్‌ దానిలోని టెక్నాలజీ, నిర్మాణాన్ని బట్టి 30మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 290 కోట్లు) నుంచి 50మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.483 కోట్లు) వరకు ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది. ఈ డ్రోన్లను దాడుల కోసమే కాకుండా నిఘా కార్యకలాపాల కోసం అమెరికా ఎక్కువగా వినియోగించింది.

ఈ వార్తలు కూడా చదవండి

రసాయన శాస్త్రంలో కగాన్‌, సోయైలకు నోబెల్ పురస్కారం

భారతీయులున్న ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి

Updated Date - Oct 08 , 2026 | 03:24 AM