Share News

భారతీయులున్న ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి

ABN , Publish Date - Oct 07 , 2026 | 08:17 AM

నల్ల సముద్ర తీరానికి సమీపంలో ఓ ఆయిల్ ట్యాంకర్‌పై మంగళవారం దాడి జరిగింది. నౌకలోని 23 మంది భారతీయ సిబ్బందిని రక్షించామని రష్యా రవాణా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

భారతీయులున్న ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి
Black Sea oil tanker attacked

ఇంటర్నెట్ డెస్క్: నల్ల సముద్ర తీరానికి సమీపంలో ఓ ఆయిల్ ట్యాంకర్‌పై మంగళవారం దాడి జరిగింది. నౌకలోని 23 మంది భారతీయ సిబ్బందిని రక్షించామని రష్యా రవాణా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదని కూడా వెల్లడించింది. నేవల్ డ్రోన్స్ సాయంతో ఈ దాడి చేశారని పేర్కొంది. తీవ్ర స్థాయిలో ఎగసిపడుతున్న మంటలు ఇంకా అదుపులోకి రాలేదని కూడా వెల్లడించింది. దాడి కారణంగా సముద్రజలాలపై ఒలికిన ముడి చమురుకు నిప్పంటుకుని మంటలు ఎగసిపడుతున్నాయని చెప్పింది.


రిసార్ట్ నగరం సోచీకి సమీపంలో ఈ దాడి జరిగింది. నౌక నుంచి నల్లటి పొగ, మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. అంతకుముందు రోజు రోమేనియా సముద్ర తీరానికి సమీపంలోని జలాల్లో మరో నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో వ్యక్తి గల్లంతయ్యారు. రష్యా జరిపిన ఈ డ్రోన్ దాడిలో ఓ భారతీయుడు గాయాలపాలయ్యారని ఉక్రెయిన్ పేర్కొంది.


2022లో యుద్ధం మొదలైన నాటి నుంచీ రష్యా, ఉక్రెయిన్‌లు నల్ల సముద్రంలోని కమర్షియల్ నౌకలను టార్గెట్ చేస్తున్నాయి. ఉక్రెయిన్‌కు ధాన్యాన్ని తరలిస్తున్న ఓ నౌకను రష్యా ఇటీవల లార్గెట్ చేసింది. తమ టౌన్లు, నగరాలను టార్గెట్ చేస్తున్నందుకు ప్రతీకారంగానే రష్యా ఇంధన రంగ మౌలిక వసతలును టార్గెట్ చేస్తున్నామని ఉక్రెయిన్ చెబుతోంది. ఇటీవల కాలంలో రెండు దేశాలు దాడులను తీవ్రతరం చేశాయి. పగటి వేళల్లో కూడా ఇటీవల రష్యా డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. కీయవ్‌లోని కీలక వంతెలను టార్గెట్ చేస్తుండటంతో అక్కడ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.


ఈ వార్తలనూ చదవండి:

రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్ల వర్షం

సౌదీలో పాక్‌, తుర్కియే బలగాలు హుతీల దాడులతో ‘మక్కా డీల్‌’ అమల్లోకి

Updated Date - Oct 07 , 2026 | 08:28 AM