సౌదీలో పాక్, తుర్కియే బలగాలు హుతీల దాడులతో ‘మక్కా డీల్’ అమల్లోకి
ABN , Publish Date - Oct 07 , 2026 | 03:33 AM
సౌదీ అరేబియా, యెమెన్‌లోని హూతీల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీలో సైనిక బలగాలను మోహరించడానికి పాకిస్థాన్, తుర్కియే అంగీకరించాయి.
ఇస్లామాబాద్, అక్టోబరు 6: సౌదీ అరేబియా, యెమెన్‌లోని హూతీల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీలో సైనిక బలగాలను మోహరించడానికి పాకిస్థాన్, తుర్కియే అంగీకరించాయి. సౌదీ ఎదుర్కొంటున్న భద్రతా ముప్పులపై తాజాగా రియాద్‌లో నిర్వహించిన సమావేశంలో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో గతేడాది ఆగస్టులో పాక్, సౌదీ, తుర్కియే మధ్య కుదిరిన మక్కా ఒప్పందం అధికారికంగా అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ఈ మూడు దేశాల కూటమిలోని ఏ ఒక్కదానిపై దాడులు జరిగినా అది మిగిలిన దేశాలపైనా జరిగిన దాడిగా పరిగణిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి
మోదీపై ట్రంప్‌నకు చాలా మంచి అభిప్రాయం: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని
దుబాయ్ ముస్లింలపై ప్రేమ ఎందుకు? : సింగర్ మికా సింగ్