సీఎంపై మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలు.. అసెంబ్లీ స్పీకర్ అభ్యంతరం
ABN , Publish Date - Sep 09 , 2026 | 02:41 PM
సీఎం రేవంత్‌రెడ్డిని ఏకవచనంతో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ధ్వజమెత్తారు. ఏలేటి చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిని ఏకవచనంతో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ధ్వజమెత్తారు. ఏలేటి చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎంను అవమానపరిచి, ఏకవచనం ప్రయోగిస్తుంటే ఏం చేయాలి? అని ప్రశ్నించారు. మహేశ్వర్ రెడ్డి కూడా ఏకవచనం ప్రయోగిస్తున్నారని అన్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు.
సభ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది: భట్టి విక్రమార్క

సభలో మైక్ ఇస్తే సీఎం రేవంత్‌రెడ్డిని ఏకవచనంతో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడటం సరికాదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఏలేటి ఇలా మాట్లాడటం బాధాకరమని ధ్వజమెత్తారు. సభ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని భట్టివిక్రమార్క పేర్కొన్నారు.
మహేశ్వర్ రెడ్డి సీఎంను ఏకవచనంతో మాట్లాడారు: మంత్రి సీతక్క

సీఎం రేవంత్‌రెడ్డిని ఏకవచనంతో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడిన మాటలను వెనక్కు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈరోజు (బుధవారం) అసెంబ్లీలో మంత్రి సీతక్క మాట్లాడారు. పోడియంలో ఫ్ల కార్డులు ప్రదర్శించవద్దనే రూల్ ఉందని తెలిపారు. అయినా బీజేపీ నేతలు పోడియంలోకి వచ్చి ఫ్ల కార్డులు ప్రదర్శిస్తున్నారని చెప్పుకొచ్చారు.
దళితులు నిరసన తెలిపిన ఎర్రవల్లి ఫాంహౌస్‌ను శుద్ధి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే వెళ్లి వచ్చిన చోట బీజేపీ నేతలు కూడా అలాగే శుద్ధి చేశారని ఆగ్రహించారు. బీజేపీ, బీఆర్ఎస్ భావజాలం ఒకటేనని విమర్శించారు. బీఆర్ఎస్‌కు మద్దతుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు.
పంచాయతీరాజ్ చట్టం- 2018 సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన మంత్రి సీతక్క
కాగా, అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టం- 2018 సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశ పెట్టారు. గ్రామ పంచాయతీల సొంత ఆదాయం సమీపంలోని నేషనల్ బ్యాంకులో జమ చేసుకునేలా చట్ట సవరణ చేశారు. ప్రస్తుతం గ్రామపంచాయతీల సొంత ఆదాయం ట్రెజరీలో జమ చేసినట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు.
అసెంబ్లీ నడవకుండా బీజేపీ సభ్యులు అడ్డుపడుతున్నారు: మంత్రి కోమటిరెడ్డి

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను ఏకవచనంతో ఆయన మాట్లాడారని ధ్వజమెత్తారు. మహేశ్వర్ రెడ్డి ఆ వ్యాఖ్యలను వెంటనే వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ నడవకుండా బీజేపీ సభ్యులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. దళితులు నిరసన తెలిపిన ఎర్రవల్లి ఫాంహౌస్‌ను శుద్ధి చేసి వారిని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు తెలంగాణలో దళితులు ఉండవద్దని కోరుకుంటున్నారా అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.
అసెంబ్లీలో సబ్జెక్ట్‌పై మాట్లాడే ఆలోచన బీజేపీకి లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

బలహీన వర్గాల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. దళితులు నిరసన తెలిపిన ఎర్రవల్లి ఫాంహౌస్‌ను శుద్ధి చేశారని ధ్వజమెత్తారు. ఇది చాలా పెద్ద సామాజిక సమస్య అని చెప్పారు. మనం ఏ యుగంలో ఉన్నామని.. ఈ విషయంపై బీజేపీ నేతల వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మహేశ్వర్ రెడ్డి ఈ విషయంపై ముందు మాట్లాడాలని పట్టుబట్టారు. అసెంబ్లీలో సబ్జెక్ట్‌పై మాట్లాడే ఆలోచన బీజేపీకి లేదని అన్నారు. 22ఏ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కచ్చితంగా చర్చిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఏమన్నారంటే..
అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్‌ను బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తప్పుబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏమైనా ప్రత్యేక రూల్‌బుక్ పెట్టారా.? అని ప్రశ్నించారు. ఏ రూల్ ప్రకారం బీఆర్ఎస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారని నిలదీశారు. బీఏసీ ప్రకారం సభ నడపాలని డిమాండ్ చేశారు. 22ఏ భూముల అంశంపై సభలో చర్చించాలని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పట్టుబట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం.. అసెంబ్లీ స్పీకర్ కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారు: కేటీఆర్
శాసన మండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ సస్పెన్షన్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ఆలోచన మాకు లేదు: స్పీకర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News