Share News

ఐవీఎఫ్ కేంద్రాల అక్రమాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:30 PM

ఐవీఎఫ్ కేంద్రాల అక్రమాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అక్రమాలకు పాల్పడే ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాల రిజిస్ట్రేషన్లను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు తెలంగాణ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.

ఐవీఎఫ్ కేంద్రాల అక్రమాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం
Telangana Minister Damodar Rajanarsimha

హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఐవీఎఫ్ కేంద్రాల అక్రమాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అక్రమాలకు పాల్పడే ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాల రిజిస్ట్రేషన్లను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు తెలంగాణ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Telangana Minister Damodar Rajanarsimha) స్పష్టం చేశారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.


కఠిన చర్యలు..

అండాల అక్రమ సేకరణ ముఠాతో సంబంధాలు ఉన్న కేంద్రాలపై కఠిన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ప్రకటించారు. అక్రమాల్లో భాగస్వాములైన వైద్యుల లైసెన్సుల రద్దుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల తర్వాత మరో ముఠా గుట్టురట్టు చేశామని పేర్కొన్నారు. ఐవీఎఫ్ కేంద్రాలపై నిరంతర నిఘా, తనిఖీలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సరోగసి, ఏఆర్‌టీ చట్టాల అమలుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


డ్రగ్స్ కంట్రోల్ అధికారుల నిఘా..

ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు. ఐవీఎఫ్ మందుల తయారీ నుంచి విక్రయాల వరకు డ్రగ్స్ కంట్రోల్ అధికారుల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. సంతానలేమితో బాధపడే దంపతులను దోచుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఐవీఎఫ్ సేవల విస్తరణను వేగవంతం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 07:11 PM