‘సర్’ ప్రక్రియలో ముస్లింల ఓట్లే టార్గెట్ చేస్తారు.. మంత్రి అజారుద్దీన్ సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:05 PM
‘సర్’ ప్రక్రియతో ముస్లింల ఓట్లను తొలగించే అవకాశముందని మంత్రి అజారుద్దీన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘సర్’ అందరి అంశమైనా.. ముస్లింల ఓట్లనే టార్గెట్ చేస్తారని ఆరోపించారు.
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ‘సర్’ (SIR) ప్రక్రియతో ముస్లింల ఓట్లను తొలగించే అవకాశముందని తెలంగాణ మంత్రి అజారుద్దీన్ (Minister Azharuddin) షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘సర్’ అందరి అంశమైనా.. ముస్లింల ఓట్లనే టార్గెట్ చేస్తారని ఆరోపించారు. పశ్చిమబెంగాల్, బిహార్‌లో ముస్లింల ఓట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. తెలంగాణలోనూ అలాంటి కుట్రలకు పాల్పడే ఛాన్స్ ఉందని ఆరోపించారు. ఈరోజు (బుధవారం) గాంధీభవన్‌లో మీడియాతో మంత్రి అజారుద్దీన్ మాట్లాడారు. ‘సర్’ అంశంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరి ఓటుని వాళ్లే కాపాడుకునే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ‘సర్’లో తొలగించే ఓట్లతో గెలుపు, ఓటములు ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు.
తెలుగులో మాట్లాడటం ఇబ్బందిగా ఉంటుంది..
తాను ఎప్పుడూ మాట్లాడినా.. నిజాయితీగా మాట్లాడుతానని మంత్రి అజారుద్దీన్ తెలిపారు. తనకు తెలుగు రాయడం, చదవడం వచ్చు అని వివరించారు. తెలుగులో మాట్లాడటం మాత్రం కొంత ఇబ్బందిగా ఉంటుందని అన్నారు. చిన్నప్పుడు తెలుగులో రాయడం, చదవడం ప్రాక్టీస్ చేసేవాడినని తెలిపారు. తెలుగులో మాట్లాడితే తప్పులు పోతే కొంత ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. తనకు సులువుగా ఉండే భాషలోనే తాను మాట్లాడుతానని అన్నారు. తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసరపు విమర్శలు చేస్తూనే ఉంటాయని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అద్భుతమైన పాలన అందిస్తున్నామని వ్యాఖ్యానించారు.
విద్యారంగంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ..
విద్యారంగంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని మంత్రి ఉద్ఘాటించారు. కేసీఆర్ హయాంలో పెండింగ్‌లో పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ని తమ ప్రభుత్వం చెల్లిస్తోందని స్పష్టం చేశారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలామంది పేదలకు సాయపడ్డానని.. పలు సమస్యలు పరిష్కరించానని తెలిపారు. తనకు పబ్లిసిటీపై మోజు లేదని అన్నారు. 200 మందికి పైగా ఆయా సమస్యలు పరిష్కరించాలని తనకు దరఖాస్తులు ఇచ్చారని తెలిపారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించానని మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
బోనస్ ఇచ్చే 7 రకాల సన్న వడ్లు అందుబాటులో ఉంచాలి: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News