Share News

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు..!

ABN , Publish Date - Oct 23 , 2026 | 03:44 PM

తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి ఇంటి వద్దకే మీ సేవా, ఆధార్ సేవలు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. అలాగే, ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు ఇంటి వద్దే పొందే అవకాశం కల్పించనుంది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు..!
Telangana MeeSeva and Aadhaar Services

హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి ఇంటి వద్దకే మీ సేవా, ఆధార్ సేవలు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. అలాగే, ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు ఇంటి వద్దే పొందే అవకాశం కల్పించనుంది. ఆధార్ నమోదు, వివరాల అప్‌డేట్ సేవలు కూడా ఇంటి వద్దకే తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మీ సేవా డోర్‌స్టెప్ ద్వారా డెలివరీకి తొలి నెలలోనే అపూర్వ స్పందన వచ్చింది.


1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు 3,885 కాల్స్, 1100కు కాల్ చేసి లేదా మీ సేవా పోర్టల్ ద్వారా సేవలు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలుపుతున్నారు. క్యూల్లో నిలబడే అవసరం లేకుండా ఇంటి వద్దే సేవలు తీసుకువచ్చేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం CURE పరిధిలోని ప్రాంతాల్లోనే డోర్‌స్టెప్ సేవలు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. బుక్ చేసుకున్న సేవల ఆధారంగా నిర్దేశిత రుసుములు చెల్లించాలనే షరతును విధించనుంది. తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఈ సేవలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మా ప్రభుత్వంలో ముదిరాజ్‌లను భాగస్వాములను చేసే బాధ్యత నాది: సీఎం రేవంత్‌రెడ్డి

టీడీఆర్ సేవలకు ఆధార్‌తో గుర్తింపు నిర్ధారణకు ప్రభుత్వం అనుమతి

ఏపీలో పెట్టుబడులే కాదు.. ఉత్పత్తి కూడా ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 23 , 2026 | 04:31 PM