Share News

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ విషయాలు మీకు తెలుసా..

ABN , Publish Date - Jan 31 , 2026 | 03:06 PM

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మీడియా సమావేశంలో పరీక్షల షెడ్యూల్, ఇన్విజిలేషన్ కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలను వివరించారు..

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ విషయాలు మీకు తెలుసా..
Intermediate Exams

హైదరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (Telangana State Board of Intermediate Education) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మీడియా సమావేశంలో పరీక్షల షెడ్యూల్, ఇన్విజిలేషన్ కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలను వివరించారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.


1440 కేంద్రాల ఏర్పాటు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1440 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్పెల్ 1, స్పెల్2గా ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. 2,74,007 మంది ఎంపీసీ విద్యార్థులు, 1, 33,415 మంది బైపీసీ విద్యార్థులు, 1,18,770 మంది వొకేషనల్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయని చెప్పారు. పరీక్షల కోసం 7,559 అధికారులను నియమించినట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు.


ల్యాబ్ ఎక్విప్‌మెంట్, పరికరాలు సిద్ధం..

ఇంటర్ పరీక్షలకు కలెక్టర్లు సహకరిస్తున్నారని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. ల్యాబ్ ఎక్విప్‌మెంట్, పరికరాలు సిద్ధం చేశామని వివరించారు. సీఎం ఆదేశానుసారం గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారరు. 7,599 మందికి ఇన్విజలేషన్ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ఆన్‌లైన్ పద్ధతిలో వారికి పేమెంట్స్ చెల్లిస్తామన్నారు. గతంలో లాగా పరీక్షల సమయంలో ఆలస్యం జరగదని స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షల కోసం 1,440 సెంటర్లు కేటాయించామని, 1,412 సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. హాల్ టికెట్లు ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రాక్టికల్‌లో ప్రభుత్వ కాలేజీల్లో జాంబ్లింగ్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. జంబ్లింగ్ విధానాన్ని ప్రైవేట్‌లో కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ లెక్చరర్లను ఫ్లయింగ్ స్క్వాడ్స్‌గా పంపిస్తామని తెలిపారు.


ఆ కాలేజీలకు సెంటర్లు కేటాయించలేదు..

7,559 మంది ఇన్విజిలేటర్లలో 4 వేల మంది దాదాపు ప్రభుత్వ లెక్చరర్లు ఉన్నారని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వివరించారు. విద్యార్థులకు నేరుగా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. కేజీబీవీలకే కాకుండా కొన్ని ప్రభుత్వ కాలేజీలకు సెంటర్లు కేటాయించలేదన్నారు. 34 శాతం మంది ప్రభుత్వ లెక్చరర్లు, 66 శాతం మంది ప్రైవేట్ లెక్చరర్లను ఇన్విజిలేటర్లుగా వాడుకుంటున్నామని తెలిపారు. పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ప్రాక్టికల్స్‌ల్లో 12 మార్కులు వస్తే విద్యార్థులు ఉత్తీర్ణులవుతారని వెల్లడించారు. గతంలో ఫెయిల్ అయిన 400 మంది బ్యాక్ లాగ్ విద్యార్థులు ఫీజు చెల్లించారన్నారు. ఐపీఈ పరీక్షలు రాసే రెగ్యులర్ విద్యార్థులు దాదాపు 10 లక్షల మంది.. బ్యాక్ లాగ్ విద్యార్థులు దాదాపు 60 వేల మంది ఉన్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాని ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం

పెళ్లి పేరుతో హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఏం జరిగిందంటే.?

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Jan 31 , 2026 | 04:00 PM