Share News

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎబోలా అలర్ట్.. స్క్రీనింగ్ కట్టుదిట్టం: మంత్రి దామోదర్

ABN , Publish Date - Jun 08 , 2026 | 03:09 PM

ఎబోలాపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఎబోలాపై శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్, సర్వైలెన్స్ మరింత కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎబోలా అలర్ట్.. స్క్రీనింగ్ కట్టుదిట్టం: మంత్రి దామోదర్
Minister Damodar Rajanarasimha

హైదరాబాద్, జూన్8 (ఆంధ్రజ్యోతి): ఎబోలాపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Rajanarasimha) వ్యాఖ్యానించారు. ఎబోలాపై శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్, సర్వైలెన్స్ మరింత కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై 21 రోజుల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఈరోజు (సొమవారం) రాష్ట్ర సచివాలయంలో ఎబోలా అప్రమత్తతపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.


ఇద్దరు అనుమానితులకు ఎబోలా నెగిటివ్ వచ్చిందని.. మరోసారి నమూనాల కోసం పరీక్ష చేశామని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్ సదుపాయాలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఎబోలా టెస్టింగ్ కిట్లు అందాయని.. పరీక్షలు ప్రారంభించినట్లు సీసీఎంబీ అధికారులు తెలిపారు. తప్పుడు చిరునామాలు ఇచ్చే ప్రయాణికులపై కేసులు నమోదు చేస్తామని మంత్రి దామోదర్ హెచ్చరించారు. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద చర్యలు చేపట్టాలని అధికారులను.. మంత్రి ఆదేశించారు.


ఫ్రెంచ్, అరబిక్, స్వాహిలి భాషా సిబ్బందిని విమానాశ్రయంలో ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర్ సూచించారు. కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఆరోగ్యం – పోలీసు – ఎయిర్‌పోర్ట్ శాఖలు సమన్వయం చేసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎబోలా నివారణకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందొద్దని.. అపోహలు నమ్మొద్దని చెప్పారు. కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ మార్గదర్శకాలతో తమ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

RRR ఎందుకు ఆగుతోంది.. కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి: సీఎం రేవంత్‌రెడ్డి

నువ్వు ఎంత రెచ్చగొట్టిన నేను తొందరపడను.. సీఎంకి కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Read Latest Telangana News And AP News  And National News

And Telugu News

Updated Date - Jun 08 , 2026 | 04:06 PM