తెలంగాణలో ఐఏఎస్, నాన్ క్యాడర్ అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ
ABN , Publish Date - Nov 28 , 2026 | 06:52 PM
తెలంగాణలో ఐఏఎస్, నాన్ క్యాడర్ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ బదిలీ చేసింది. ఎనిమిది మంది అధికారులకు స్థానచలనం కల్పించింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు.
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఐఏఎస్, నాన్ క్యాడర్ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ బదిలీ (Telangana IAS Transfers) చేసింది. ఎనిమిది మంది అధికారులకు స్థానచలనం కల్పించింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఈవీ నరసింహారెడ్డిని నియమించగా, హెచ్ఎండీఏ బాధ్యతల నుంచి సర్ఫరాజ్ అహ్మద్‌ను బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా సర్ఫరాజ్ అహ్మద్‌ని నియమించింది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఈవీ నరసింహారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించింది.
హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీగా అజిత్ రెడ్డికి అదనపు బాధ్యతలను కేటాయించింది. శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా మయాంక్ మిట్టల్‌కు ఎఫ్ఏసీ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా కె. చంద్రకళను నియమించింది. హైదరాబాద్ మెట్రో రైల్ జాయింట్ ఎండీగా మనోజ్‌ను, విద్యాశాఖ ప్రాజెక్టుల స్పెషల్ ఆఫీసర్‌గా పి. రామును తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం
పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News