తెలంగాణ ప్రభుత్వంతో యామ్జెన్ ఎంఓయూ
ABN , Publish Date - Aug 11 , 2026 | 07:25 PM
జీనోమ్ వ్యాలీలో ‘యామ్జెన్’ అత్యాధునిక పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో యామ్జెన్ ఎంఓయూ కుదుర్చుకుంది. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
హైదరాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జీనోమ్ వ్యాలీలో ‘యామ్జెన్’ అత్యాధునిక పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో యామ్జెన్ ఎంఓయూ కుదుర్చుకుంది. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాల విస్తరణకు యామ్జెన్ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. జీనోమ్ వ్యాలీలో భారీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు కానుందని తెలిపారు. దీని ద్వారా స్థానిక ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని వెల్లడించారు.
ఇప్పటికే మూడు వేల ఉద్యోగులతో అతిపెద్ద జీసీసీని యామ్జెన్ ఏర్పాటు చేసిందని మంత్రి వ్యాఖ్యానించారు. లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ కీలక గమ్యస్థానంగా మారుతోందని వివరించారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు తెలంగాణ ప్రత్యేకత అని తెలిపారు. స్థానిక యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని యామ్జెన్ నిర్వాహకులకు సూచించారు. క్యాన్సర్, గుండె, ఎముకలు, అరుదైన వ్యాధులపై యామ్జెన్ పరిశోధనలు చేస్తోందని అన్నారు. దాదాపు 100 దేశాల్లో యామ్జెన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్
ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
తెలంగాణలో 73.95 లక్షల ఓట్లు ఔట్?
Read Latest AP News And Telangana News And National News
And Telugu News