Share News

ఇందిరమ్మ ఇళ్లకు రెరా అనుమతులు.. పేదలకు రూ.6 లక్షలకే ఫ్లాట్లు!

ABN , Publish Date - Nov 23 , 2026 | 07:45 PM

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ ప్రాజెక్టులకు రెరా అనుమతులు ఇచ్చింది. హౌజింగ్ బోర్డు చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ ప్రాజెక్టులను రెరా గుర్తించింది.

ఇందిరమ్మ ఇళ్లకు రెరా అనుమతులు.. పేదలకు రూ.6 లక్షలకే ఫ్లాట్లు!
Indiramma Housing Scheme

హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ ప్రాజెక్టులకు రెరా అనుమతులు ఇచ్చింది. హౌజింగ్ బోర్డు చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ ప్రాజెక్టులను రెరా గుర్తించింది. ఈ మేరకు తెలంగాణ హౌజింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతం.. రెరా అనుమతి పత్రాలను అందుకున్నారు. తొలి విడతలో మలక్‌పేట, కుత్బుల్లాపూర్ ప్రాజెక్టులకు ఈ అనుమతులను ఇచ్చింది. హైదరాబాద్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వీపీ గౌతం తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా 20 నియోజకవర్గాల్లో 12 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు.


ఈ ఏడాదిలోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని వీపీ గౌతం తెలిపారు. మార్కెట్‌లో రూ.30 నుంచి రూ. 50 లక్షల విలువైన ఫ్లాట్లు.. పేదలకు కేవలం రూ.6 లక్షలకే అందజేయనున్నట్లు తెలిపారు. ఉచితంగా భూమి కేటాయింపుతో పాటు ఫ్లాట్లపై అవిభక్త భూమి వాటా రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ హామీలకు రెరా అనుమతులు చట్టబద్ధత కల్పించనుందని అన్నారు. ఆయా ప్రాజెక్టుల్లో పారదర్శకత, నాణ్యత, లబ్ధిదారుల హక్కులకు భరోసా కల్పించనుందని వెల్లడించారు. రెరా గుర్తింపుతో బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియ వేగవంతమవుతోందని వీపీ గౌతం తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

తెలంగాణలో ష్నైడర్‌ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 08:12 PM