Share News

మహాలక్ష్మి గ్యాస్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ABN , Publish Date - Nov 28 , 2026 | 07:30 PM

మహాలక్ష్మి గ్యాస్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీకి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అర్హులైన లబ్ధిదారుల ఆధార్ వివరాల అనుసంధానానికి ఆదేశాలు జారీ చేసింది.

మహాలక్ష్మి గ్యాస్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Telangana Mahalakshmi Gas Scheme

హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): మహాలక్ష్మి గ్యాస్ పథకంపై (Mahalakshmi Gas Scheme) తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీకి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అర్హులైన లబ్ధిదారుల ఆధార్ వివరాల అనుసంధానానికి ఆదేశాలు జారీ చేసింది. రేషన్ కార్డు, ఆధార్, ఎల్పీజీ కనెక్షన్ వివరాలను మ్యాపింగ్ చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఆధార్ నంబర్ ఉన్నవారు అథెంటికేషన్ చేయించుకోవాలని సూచించింది. ఆధార్ లేని వారికి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలతో వెసులుబాటు కల్పించింది. పాన్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులతోనూ గుర్తింపు ధ్రువీకరణకు అవకాశం ఇచ్చింది.


వేలిముద్రలు పడకపోతే ఐరిస్, ఫేస్ అథెంటికేషన్‌ చేయించుకోవడానికి తెలంగాణ సర్కార్ అవకాశం ఇచ్చింది. ఇందుకోసం ఓటీపీ, క్యూఆర్ కోడ్‌ల ద్వారా కూడా ఆధార్ ధ్రువీకరణ పత్రాలతో చేయించుకోవచ్చని తెలిపింది. బయోమెట్రిక్ సమస్యలతో అర్హులకు పథకం ఆగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చని తెలిపింది. నకిలీ లబ్ధిదారులను ఏరివేసేందుకు ప్రత్యేక విధానం రూపొందించినట్లు పేర్కొంది. ప్రతి నెలా ఆయిల్ కంపెనీలకు సబ్సిడీ నిధులు ముందస్తుగా చెల్లిస్తున్నట్లు వెల్లడించింది. డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ జమ అవుతుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం

పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 28 , 2026 | 07:55 PM