తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు
ABN , Publish Date - Oct 03 , 2026 | 08:07 PM
అక్టోబర్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు బతుకమ్మ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. బతుకమ్మ ఏర్పాట్లపై సీఎస్ సంజయ్ జాజు శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): అక్టోబర్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు బతుకమ్మ వేడుకలను (Bathukamma Celebrations) తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. బతుకమ్మ ఏర్పాట్లపై సీఎస్ సంజయ్ జాజు ఈరోజు (శనివారం) సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 18వ తేదీన ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలు జరపనుంది. ఈ వేడుకను వేలాది మంది మహిళలతో భారీ బతుకమ్మ ఉత్సవం నిర్వహించనుంది. అమరవీరుల స్మారక కేంద్రం నుంచి ట్యాంక్‌బండ్ వరకు బతుకమ్మలతో ర్యాలీ చేపట్టనుంది.
వందలాది మంది కళాకారులతో ప్రత్యేక సంస్కృతిక ప్రదర్శనలను ప్రభుత్వం నిర్వహించనుంది. సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై ఈ వేడుకలు జరగనున్నాయి. ట్రాఫిక్ డైవర్షన్లు, బారికెడ్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. నెక్లెస్ రోడ్, బతుకమ్మ ఘాట్‌ల వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేయనుంది. నగరంలోని ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ లైట్లను అలంకరించనుంది. రవీంద్ర భారతిలో పది రోజుల పాటు బతుకమ్మ వేడుకలు నిర్వహించనుంది.
రాష్ట్రంలోని టూరిజం కేంద్రాలు, ప్రముఖ ప్రాంతాల్లోనూ ఈ వేడుకలు నిర్వహించనుంది. బతుకమ్మ ఉత్సవాల కోసం ప్రత్యేక లోగో రూపకల్పన చేయనుంది. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026ను ప్రతిబింబించేలా ప్రభుత్వం లోగో రూపకల్పన చేయనుందని సీఎస్ సంజయ్ జాజు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజా రవాణాను ఏకీకృతం చేసే దిశగా కీలక అడుగు వేశాం: సీఎం రేవంత్‌రెడ్డి
రేవంత్‌రెడ్డి, కేటీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: రఘునందన్‌రావు
హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.. 76 ప్రాంతాల్లో మార్పులు\
Read Latest Telangana News And AP News And National News
And Telugu News