కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:33 PM
కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్‌పై (Kaleshwaram Project) తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు Col. పరిచిత్ మెహ్రా ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఇంజినీర్లు, నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. మూడు బ్యారేజీల మరమ్మతులకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మాన్సూన్‌కు ముందే జియో టెక్నికల్ పరిశీలనలు పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ సూచించింది. మే 30వ తేదీలోగా పరిశీలనలు పూర్తిచేయాలని డెడ్‌లైన్ విధించింది. రోజువారీ పురోగతి నివేదికలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. సీడబ్ల్యూసీ ఎన్డీఎస్ఏ అనుమతులతో పనులు, డిజైనింగ్ పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. రోజువారీ యాక్షన్ ప్లాన్‌తో పనులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌కు తాకట్టు పెట్టారు: సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్.. నీ చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు.. మహేశ్ గౌడ్ సవాల్
ఎండల్లో బయటకు రావొద్దు.. ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు
Read Latest Telangana News And AP News And International News And Telugu News