Share News

సర్కార్‌ పనితీరు ఎలా ఉంది? ఏది నచ్చింది.. ఏది నచ్చలేదు..?

ABN , Publish Date - Oct 08 , 2026 | 04:21 AM

అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా.. తన పాలన, పనితీరు బాగుందనుకుంటే సరిపోదు. పనితీరు పట్ల ప్రజల స్పందన ఎలా ఉందన్నదానిపై ఎప్పటికప్పుడు వాస్తవిక సమాచారం తెలుసుకుంటూ ఉండాలి.

సర్కార్‌ పనితీరు ఎలా ఉంది? ఏది నచ్చింది.. ఏది నచ్చలేదు..?
Telangana government survey

  • ప్రభుత్వ పనితీరు అంచనాకు.. 7 ప్రశ్నలతో ఇంటెలిజెన్స్‌ సర్వే!

  • జీహెచ్‌ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం

  • స్పందనను బట్టి పనితీరును..మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వ ఆలోచన

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా.. తన పాలన, పనితీరు బాగుందనుకుంటే సరిపోదు. పనితీరు పట్ల ప్రజల స్పందన ఎలా ఉందన్నదానిపై ఎప్పటికప్పుడు వాస్తవిక సమాచారం తెలుసుకుంటూ ఉండాలి. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకున్నప్పుడే.. పనితీరును మెరుగు పరుచుకునేందుకు, లోపాలను సరిదిద్దుకునేందుకూ వీలుంటుంది. ఈ నేపథ్యంలోనే తన పనితీరుపై రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వమూ ఇంటెలిజెన్స్‌ సాయంతో క్షేత్రస్థాయి సర్వేను ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఏది నచ్చింది? తదితర ఏడు ప్రశ్నలపై ఈ సర్వేలో భాగంగా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు.


గ్రామ పంచాయతీలు, కార్పొరేషన్‌ డివిజన్లు, మునిసిపల్‌ వార్డుల స్థాయిలో ఈ సర్వేను నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నెలరోజుల పాటు నిర్వహించే ఈ సర్వేలో గ్రామ పంచాయతీ, మునిసిపల్‌ వార్డుల్లో 25 మంది చొప్పున, కార్పొరేషన్‌ డివిజన్లలో వంద మంది చొప్పున ఈ ఏడు ప్రశ్నలను సంధించి.. సమాధానాలు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వేలో ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా లోటుపాట్లు ఏమన్నా ఉంటే సరిచేసుకోవడం, పనితీరును మెరుగుపరుచుకో వడం చేయనున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ఏడు ప్రశ్నల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయదల్చుకోకుంటే దానికి గల కారణం ఏంటన్న ప్రశ్నలూ ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ, ఇతర మునిసిపల్‌ కార్పొరేషన్లకు, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఈ సర్వే చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది.


క్షేత్రస్థాయి సర్వేలో అడుగుతున్న 7 ప్రశ్నలు ఇవే!

1. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పనితీరు

ఎలా ఉందని మీరు భావిస్తున్నారు?

(ఎ) బాగుంది (బి) పరవాలేదు (సి) బాగాలేదు (డి) తెలియదు (ఈ) చెప్పను

2. ముఖ్యమంత్రిగారి పనితీరు ఎలా ఉందని మీరు భావిస్తున్నారు?

(ఎ) బాగుంది (బి) పరవాలేదు (సి) బాగాలేదు (డి) తెలియదు (ఈ) చెప్పను

3. మీ ఎమ్మెల్యేగారి పనితీరు

ఎలా ఉందని మీరు భావిస్తున్నారు?

(ఎ) బాగుంది (బి) పరవాలేదు (సీ) బాగాలేదు (డి) తెలియదు (ఈ) చెప్పను

4. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే

బాగుంటుందని మీరు అనుకుంటున్నారు?

(ఎ) కాంగ్రెస్‌ (బి) బీఆర్‌ఎస్‌ (సి) బీజేపీ (డి) ఏదైనా కొత్తపార్టీ (ఈ) ఇతరులు (ఎఫ్‌) తెలియదు (జి) చెప్పను

5. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే

మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు?

(ఎ) కాంగ్రెస్‌ (బి) బీఆర్‌ఎస్‌ (సి) బీజేపీ (డి) ఎంఐఎం (ఈ) సీపీఐ (ఎఫ్‌) సీపీఎం (జి) ఇతరులు (హెచ్‌) తెలియదు (ఐ) చెప్పను


6. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయని పక్షంలో

దానికి గల కారణాలు ఏంటి?

(ఒకటికి మించి ఎన్నుకోవచ్చు)

(ఎ) హైడ్రా (బి) సెక్షన్‌ 22 ఎ (సి) ఎన్నికల వాగ్దానాల అమల్లో జాప్యం (డి) నిరుద్యోగ సమస్య (ఈ) జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేయకపోవడం (ఎఫ్‌) రైతు భరోసా ఇవ్వకపోవడం (జి) ఎమ్మెల్యేల పనితీరు (హెచ్‌) ముఖ్యమంత్రిగారి పనితీరు (ఐ) ప్రభుత్వ పనితీరు (జే) ఫీజురీయింబర్స్‌మెంట్‌ అమల్లో జాప్యం (కె) అవినీతి (ఎల్‌) ఉచిత పథకాలకు వ్యతిరేకం (ఎం) విద్యుత్తు కోతలు (ఎన్‌) ఉద్యోగులు, రిటైర్‌ అయిన వారి సమస్యలు (ఓ) ఇతర కారణాలు (పి) తెలియదు (క్యూ) చెప్పను

7. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల్లో

ఏ పథకం బాగుందని మీరు భావిస్తున్నారు?

(ఎ) మహిళలకు ఫ్రీ బస్సు (బి) రైతు భరోసా (సి) కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌ (డి) గ్యాస్‌ సబ్సిడీ (ఈ) గృహజ్యోతి (ఎఫ్‌) రైతు రుణమాఫీ (జి) సన్నబియ్యం పంపిణీ (హెచ్‌) చేయూత పింఛన్లు (ఐ) ఇందిరమ్మ ఇళ్లు (జె) ఇతర పథకాలు (కె) ఏదీ నచ్చలేదు (ఎల్‌) ఉచితాలకు వ్యతిరేకం (ఎం) తెలియదు (ఎన్‌) చెప్పను


ఇవి కూడా చదవండి...
రాహుల్‌ పోరాటంతో కేంద్రంలో వణుకు

ఓంకారేశ్వరాలయానికి.. రూ.948.65 కోట్లు
బతికున్న భార్య ఓటును తొలగించాలని.. మరణించిన భర్త దరఖాస్తు!
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 04:21 AM