Share News

ఆక్సాయ్‌చిన్‌, పీవోకేలోని.. 28 ప్రాంతాలకు భారత్‌ కొత్త పేర్లు

ABN , Publish Date - Oct 08 , 2026 | 04:03 AM

పాకిస్థాన్‌, చైనాల ఆధీనంలో ఉన్న భారత భూభాగాలకు కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రామాణిక పేర్లను ఖరారు చేసింది.

ఆక్సాయ్‌చిన్‌, పీవోకేలోని..  28 ప్రాంతాలకు భారత్‌ కొత్త పేర్లు
pok

న్యూఢిల్లీ, అక్టోబరు 7: పాకిస్థాన్‌, చైనాల ఆధీనంలో ఉన్న భారత భూభాగాలకు కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రామాణిక పేర్లను ఖరారు చేసింది. పీవోకే, ఆక్సాయ్‌చిన్‌ ప్రాంతాల్లో ఉన్న 28 పర్వత శిఖరాలు, నీటి వనరులు, భూభాగాలకు ఈ పేర్లను పెట్టింది. ఇలా నామకరణం చేసినవాటిలో 10 శిఖరాలు, 3 పర్వతాలు, 7 భూభాగాలు, 2 కనుమలు (పాస్‌లు), 2 హిమానీ నదాలు, ఒక్కోటి చొప్పున లోయ, సరస్సు, నది, మరో జలవనరు ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో ఉన్నాయి. ప్రజల్లో భూభాగాలపై అవగాహన కల్పించడం, ఆయా ప్రాంతాలను కచ్చితంగా గుర్తించడం కోసం వాటికి ప్రామాణిక పేర్లను ఖరారు చేసినట్టు కేంద్రం పేర్కొంది. పాక్‌, చైనా ఆధీనంలో ఉన్న పీవోకే, ఆక్సాయ్‌చిన్‌ భూభాగాలన్నీ తమ సార్వభౌమాధికార పరిధిలోనివని భారత్‌ తొలి నుంచీ స్పష్టం చేస్తూనే వస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి

అదుపులోకి రాహుల్ గాంధీ, ప్రియాంక.. నేలపై పడుకొని ప్రియాంక నిరసన.

యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు.

Updated Date - Oct 08 , 2026 | 04:03 AM