Share News

పెళ్లి తర్వాత విందు ఇస్తే లక్ష.. ఆ విందుకు వెళ్తే రూ.50వేలు.. ఫైన్‌!

ABN , Publish Date - Oct 08 , 2026 | 04:07 AM

రాష్ట్రంలో ప్రస్తుతం కరవు తాండం చేస్తోందని, ఈ పరిస్థితుల్లో సామాన్య ప్రజలపై సంప్రదాయం పేరిట ఆర్థికభారం మోపడం సమంజసం కాదని ఆ గ్రామం బలమైన నిర్ణయం తీసుకుంది

పెళ్లి తర్వాత విందు ఇస్తే లక్ష..   ఆ విందుకు వెళ్తే రూ.50వేలు.. ఫైన్‌!
MARRIAGE ceremony

  • కర్ణాటకలోని హరగి గ్రామంలో పెద్దల నిర్ణయం

బెంగళూరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుతం కరవు తాండం చేస్తోందని, ఈ పరిస్థితుల్లో సామాన్య ప్రజలపై సంప్రదాయం పేరిట ఆర్థికభారం మోపడం సమంజసం కాదని ఆ గ్రామం బలమైన నిర్ణయం తీసుకుంది. పెళ్లి తర్వాత ‘బీగర ఊట’ పేరిట వరుడి కుటుంబం ఇచ్చే మాంసాహార విందును నిషేధించింది. ఊరి నిర్ణయాన్ని కాదని విందు ఏర్పాటు చేస్తే లక్ష రూపాయల జరిమానా, విందులో పాల్గొంటే రూ.50వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని గ్రామ పెద్దలు హెచ్చరించారు. కర్ణాటకలో పెళ్లికి సంబంధించి ఒక ప్రత్యేక సంప్రదాయం దశాబ్దాలుగా ఉంది. పెళ్లికుమార్తె తరపువారు కల్యాణం జరిపిస్తారు. పెళ్లి ముగిసిన వెంటనే పెళ్లికుమార్తె బంధువులు, వారి మిత్రులందరికీ వరుడి కుటుంబం మాంసాహార విందును ఏర్పాటు చేస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి

అదుపులోకి రాహుల్ గాంధీ, ప్రియాంక.. నేలపై పడుకొని ప్రియాంక నిరసన.

యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు.

Updated Date - Oct 08 , 2026 | 04:08 AM