Share News

చేయూత పెన్షన్ దరఖాస్తు గడువు పొడిగింపు

ABN , Publish Date - Aug 31 , 2026 | 09:45 PM

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చేయూత పెన్షన్ దరఖాస్తుదారులకు కీలక ప్రకటన చేసింది.

చేయూత పెన్షన్ దరఖాస్తు గడువు పొడిగింపు
Telangana Government

హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. చేయూత పెన్షన్ దరఖాస్తుదారులకు కీలక ప్రకటన చేసింది. కొత్తగా చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఉన్న గడువును మరో 15 రోజులపాటు పొడిగించింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అర్హులైన లబ్ధిదారులు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 15వ తేదీ వరకు సమర్పించే అవకాశం కల్పించింది.


‘సర్’ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, దివ్యాంగులు, వృద్ధులు, ఇతర అర్హులైన లబ్ధిదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. దరఖాస్తు చేసుకునేందుకు మరింత సమయం కావాలని పలువురు కోరడంతో గడువును పొడిగిస్తూ రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులకు మరో అవకాశం కల్పించింది.


చేయూత పెన్షన్ పథకం ద్వారా అర్హులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్న వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు సమయంలో అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని, వివరాలను సరిగ్గా నమోదు చేయాలని సూచించారు.


సెప్టెంబర్ 15వ తేదీ తర్వాత దరఖాస్తుల స్వీకరణపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదు. అందువల్ల అర్హులైన వారు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

‘టాక్సిక్‌‌’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజాసింగ్

వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 09:55 PM