శాసనసభ, శాసనమండలిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
ABN , Publish Date - Jun 02 , 2026 | 07:43 AM
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని శాసనసభ, శాసనమండలి ప్రాంగణాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని స్మరించుకుంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని (Telangana Formation Day) పురస్కరించుకుని హైదరాబాద్‌లోని శాసనసభ, శాసనమండలి ప్రాంగణాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని స్మరించుకుంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు.
శాసనసభ ఆవరణలో..
తెలంగాణ శాసనసభ ఆవరణలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శాసనసభ సిబ్బంది హాజరై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
తెలంగాణ శాసనమండలిలో..
తెలంగాణ శాసనమండలిలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, M. కోదండరాం, విజయశాంతితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్‌రావు
బెట్టింగ్ రాకెట్‌పై సీఐడీ ఉక్కుపాదం.. 11 మంది అరెస్ట్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News