Share News

ఈగల్ పోలీసుల ఆపరేషన్.. రూ.12 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Jun 04 , 2026 | 10:28 AM

తెలంగాణలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఈగల్ పోలీసులు కీలక ఆపరేషన్ నిర్వహించారు. ఈ భారీ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈగల్ పోలీసుల ఆపరేషన్.. రూ.12 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం
Telangana EAGLE Police

హైదరాబాద్, జూన్4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఈగల్ పోలీసులు (EAGLE Police) కీలక ఆపరేషన్ నిర్వహించారు. ఈ భారీ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. థాయ్‌లాండ్ నుంచి భారతదేశానికి అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకుని అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా కార్యకలాపాలను వెలుగులోకి తెచ్చారు.


ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న ఓ విదేశీ మహిళతో పాటు మొత్తం 10 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.12 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్ కోసం ఈగల్ అధికారులు దాదాపు నెల రోజుల పాటు ప్రత్యేక నిఘా, సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించినట్లు అధికారులు పేర్కొన్నారు.


హైడ్రోపోనిక్ గంజాయి సాధారణ గంజాయితో పోలిస్తే అధిక మత్తు ప్రభావం కలిగి ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి భారీ డిమాండ్ ఉంటుందని ఈగల్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇలాంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో అధికారులు వెల్లడించనున్నారు. అరెస్టు చేసిన నిందితుల నేపథ్యం, స్మగ్లింగ్ మార్గాలు, నెట్‌వర్క్ విస్తృతి, స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల వివరాలను వెల్లడించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్‌లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Read Latest Telangana News And AP News  And National News

And Telugu News

Updated Date - Jun 04 , 2026 | 10:34 AM