డయల్ 112 ప్రారంభం.. అందుబాటులోకి 18 రకాల సేవలు..
ABN , Publish Date - Aug 05 , 2026 | 02:50 PM
తెలంగాణలో డయల్ 112 సేవలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బుధవారం ప్రారంభించారు.
హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో డయల్ 112 సేవలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ (Telangana DGP CV Anand) కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. డయల్ 112 ద్వారా 18 రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. న్యాయసాయం, వైద్యసాయం, సైబర్‌సాయం అనేక సమస్యల పరిష్కారాలకు డయల్ 112 పరిష్కార మార్గమని వ్యాఖ్యానించారు. డయల్ 112కు ఫోన్ చేసినప్పుడు పోలీసులు దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
డ్రోన్ టీమ్‌ను సైతం ఏర్పాటు చేస్తాం..
ఒకే వ్యవస్థలోకి పోలీస్, ఫైర్, అంబులెన్స్ సేవలు, TGICCC నుంచి డయల్ 112 సేవలను పర్యవేక్షిస్తామని డీజీపీ తెలిపారు. ప్రజల భద్రత, అత్యవసర స్పందన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు. డయల్ 112 ఫోన్ రాగానే కాలర్ లొకేషన్ కోసం అడ్వాన్స్ ఆల్స్ వాడుతున్నామని పేర్కొన్నారు. డ్రోన్ బెస్డ్ టెక్నికల్ సిస్టంను త్వరలోనే తెలంగాణ పోలీసులు ఉపయోగిస్తారని వివరించారు. డ్రోన్ టీమ్‌ను సైతం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పుకొచ్చారు. డయల్ 112 అనేది 3.0 వర్షన్‌గా ఉంటుందని తెలిపారు.
టెక్నాలజీ పోలీసింగ్‌ను అమల్లోకి తెస్తాం..
యువ ఏపీఎస్‌లు, ఏఐ టెక్నాలజీ వాడే వారిని ఇందులో భాగస్వామ్యం చేయబోతున్నామని డీజీపీ ఆనంద్ పేర్కొన్నారు. బేసిక్ పోలీసింగ్ లాగా టెక్నాలజీ పోలీసింగ్‌ను అమల్లోకి తీసుకువస్తున్నామని వ్యాఖ్యానించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ టవర్ - Bలో రెండు ఫ్లోర్‌లను డయల్ 112కి కేటాయించామని తెలిపారు. డయల్ 100ను 2013లో కొంపల్లిలో GVK వారి సాయంతో ప్రారంభించామని ప్రస్తావించారు. వివిధ అత్యవసరాలకు ఒకే నంబర్ ఉండాలని గతంలో కేంద్రప్రభుత్వం సూచించిందని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెక్నికల్ డెవలప్‌మెంట్ చేస్తూ వచ్చామని అన్నారు. ఇటీవల ఏఐ వచ్చాక అనేక పనులు సులువుగా అయిపోతున్నాయని డీజీపీ ఆనంద్ వెల్లడించారు.
వార్తలు కూడా చదవండి...
మెటాపై కేసు నమోదు చేసిన ఆ డీసీపీని.. రేవంత్‌రెడ్డి బదిలీ చేశారు: కిషన్‌రెడ్డి
తెలంగాణలో అగమ్యగోచరంగా ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి: హరీశ్‌రావు
మెటాకు కేంద్ర ప్రభుత్వం సమన్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News