Share News

జీరో నక్సల్ స్టేట్‌గా తెలంగాణ: డీజీపీ ఆనంద్

ABN , Publish Date - Oct 23 , 2026 | 10:49 AM

నక్సల్స్ సమస్య 1980లో ఉండేదని.. ఇందుకోసం గ్రేహౌండ్స్ ఏర్పాటు చేశామని.. ఈ విభాగానికి దేశవ్యాప్తంగా ప్రాముఖ్యం ఉందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు.

జీరో నక్సల్ స్టేట్‌గా తెలంగాణ: డీజీపీ ఆనంద్
Telangana DGP CV Anand

హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): నక్సల్స్ సమస్య 1980లో ఉండేదని.. ఇందుకోసం గ్రేహౌండ్స్ ఏర్పాటు చేశామని.. ఈ విభాగానికి దేశవ్యాప్తంగా ప్రాముఖ్యం ఉందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (Telangana DGP CV Anand) వ్యాఖ్యానించారు. నక్సల్స్ సమస్య తగ్గిపోయిన తర్వాత గతంలో హైదరాబాద్‌లో బ్లాస్టులు జరిగాయని.. అప్పుడు అక్టోపస్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇటీవల జీరో నక్సల్ స్టేట్‌గా తెలంగాణ ఏర్పాటైందని అన్నారు. రెండేళ్లలో 824 మంది లొంగిపోయారని.. 302 ఆయుధాలను అప్పగించారని ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల పోలీస్ సమన్వయ కమిటీ భేటీ ఈరోజు (శుక్రవారం) హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళం డీజీపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడారు.


డ్రగ్స్‌పై పోరాటానికి ఈగల్ ఫోర్స్ ఏర్పాటు..

ఇప్పుడు డ్రగ్స్‌పై పోరాటానికి ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేశామని డీజీపీ ఆనంద్ వెల్లడించారు. డీజీ స్థాయి అధికారి దీనికి హెడ్‌గా ఉంటారని ప్రస్తావించారు. దేశ విదేశాల్లో నేరగాళ్ల కోసం ప్రత్యేక ఆపరేషన్లు చేశారని తెలిపారు. ఇందుకు గాను కేంద్ర హోం శాఖ అవార్డు ఇచ్చిందని అన్నారు. సైబర్ నేరాల కట్టడికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశామని వివరించారు. ఇటీవల సీఎస్‌బీ చేసిన ఎఫర్ట్స్‌కి కేంద్ర హోం శాఖ అవార్డు ఇచ్చిందని తెలిపారు. డయల్ 112 నంబర్‌ను బలోపేతం చేశామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ద్వారా ప్రకృతి విపత్తుల్లో సమర్థవంతంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. పోలీసులు వినియోగించే యాప్స్‌ను పూర్తిగా ఏఐ బేస్డ్‌గా మార్చేసి tspark పేరుతో అప్‌డేట్ చేశామని తెలిపారు. స్త్రీల భద్రతకు మహిళా భద్రత విభాగం పనిచేస్తోందని వివరించారు. అలాగే, టీ-సేఫ్ యాప్‌ను రూపొందించామని డీజీపీ ఆనంద్ పేర్కొన్నారు.


డ్రగ్స్‌కు బానిసైన వారికోసం సన్మిత్ర: డీజీపీ సలీం

కర్ణాటకలో ‘మనే మనేగే పోలీస్’ పేరుతో సీనియర్ సిటిజన్, పేద ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు కర్ణాటక డీజీపీ ఎంఏ సలీం తెలిపారు. మొత్తం కోటి మందికి పైగా ప్రజల సమస్యలను పోలీసు సిబ్బంది పరిష్కరించినట్లు వివరించారు. ప్రత్యేక మొబైల్ నంబర్‌ను ఏర్పాటు చేసి వాటికీ అత్యవసర సహాయం అందేలా చూస్తున్నామని తెలిపారు. డ్రగ్స్‌కు బానిసైన వారికోసం ‘సన్మిత్ర’ పేరుతో సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా సహకారంతో డ్రగ్స్ కట్టడికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ట్రాఫిక్ ప్రధాన సమస్య అని... రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ‘అస్త్రం’ పేరుతో ఏఐ బేస్డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేశామని కర్ణాటక డీజీపీ సలీం పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మా ప్రభుత్వంలో ముదిరాజ్‌లను భాగస్వాములను చేసే బాధ్యత నాది: సీఎం రేవంత్‌రెడ్డి

టీడీఆర్ సేవలకు ఆధార్‌తో గుర్తింపు నిర్ధారణకు ప్రభుత్వం అనుమతి

తెలంగాణ అభివృద్ధిలో ఎస్పీఎఫ్ పాత్ర కీలకం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 23 , 2026 | 12:05 PM