మాజీ మంత్రి యనమలకు స్వల్ప అస్వస్థత
ABN , Publish Date - Oct 22 , 2026 | 03:51 PM
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాకినాడలోని ట్రస్ట్ ఆస్పత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు.
కాకినాడ: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (TDP Leader Yanamala Ramakrishnudu ) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాకినాడలోని ట్రస్ట్ ఆస్పత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయనకు గుండె శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యనమలకు అమర్చిన స్టంట్లో స్వల్ప ఇబ్బందులు రావడంతో అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆ తర్వాత తిరిగి వైద్యం అందించడంతో యనమల ఆరోగ్యం కుదుటపడింది. ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు ఆయనను తరలించారు. యనమలకు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.
యనమల ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా..
కాగా, యనమల ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. యనమల ఆరోగ్య పరిస్థితి గురించి తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సీఎం.. తెలుగుదేశం పార్టీ నేతలను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎంపీ సానా సతీశ్ ట్రస్ట్ ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. యనమల ఆరోగ్య పరిస్థితి గురించి సీఎంకు సమాచారం అందజేశారు.
ఇవి కూడా చదవండి...
విశాఖలో రోడ్డు ప్రమాదం.. గాయపడిన విద్యార్థులకు హోంమంత్రి అనిత సాయం
నకిలీ వాట్సాప్ నిర్వాహకులకు పవన్ కల్యాణ్ కార్యాలయం హెచ్చరిక
Read Latest AP News And Telugu News