Share News

ప్రపంచ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2.0: భట్టి విక్రమార్క

ABN , Publish Date - Oct 09 , 2026 | 06:31 PM

ప్రపంచ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం ప్రజాభవన్‌లో సమ్మిట్ వార్ రూమ్‌ను ఆయన సందర్శించారు.

ప్రపంచ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2.0: భట్టి విక్రమార్క
Telangana Deputy CM Bhatti Vikramarka

హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Telangana Deputy CM Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ఈరోజు (శుక్రవారం) ప్రజాభవన్‌లో సమ్మిట్ వార్ రూమ్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈ సమ్మిట్ ఏర్పాట్లపై భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ 7, 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ సమ్మిట్ జరుగుతుందని వెల్లడించారు.


సమన్వయంతో పనిచేయాలి..

వివిధ శాఖల కమిటీలు సమన్వయంతో పనిచేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఆయా శాఖల మధ్య నిరంతర సమాచార మార్పిడి ఉండాలని స్పష్టంచేశారు. తెలంగాణకు ప్రపంచస్థాయి పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు. అంతర్జాతీయంగా తెలంగాణ ప్రతిష్ఠను పెంచేలా ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమ్మిట్ విజయవంతానికి ప్రతి శాఖ సమష్టిగా కృషి చేయాలని భట్టి విక్రమార్క సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఈసీ, కేంద్ర విధానాలపై మా పోరాటం ఆగదు: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణను అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి: సీఎస్

మహిళా సాధికారతకు కొత్త అడుగు.. జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు: సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 06:39 PM