కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలకు వేగంగా చర్యలు: సీఎస్ సంజయ్ జాజు
ABN , Publish Date - Oct 24 , 2026 | 07:08 PM
కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలకు వేగంగా చర్యలు చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వ్యాఖ్యానించారు. శనివారం కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, నిధుల సాధనపై సీఎస్ సంజయ్ జాజు సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలకు వేగంగా చర్యలు చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (Telangana CS Sanjay Jaju) వ్యాఖ్యానించారు. ఈరోజు (శనివారం) కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, నిధుల సాధనపై సీఎస్ సంజయ్ జాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై మార్గనిర్దేశం చేశారు. కేంద్ర నిధుల సాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన పెండింగ్ ప్రక్రియలను పూర్తి చేయాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
కేంద్ర నిధుల విడుదలకు అవసరమైన ప్రక్రియలు వేగవంతం చేయాలి...
అలాగే, వ్యవసాయం నుంచి పట్టణాభివృద్ధి వరకు పలు శాఖలపై సీఎస్ సంజయ్ జాజు సమీక్షించారు. కేంద్ర నిధుల విడుదలకు అవసరమైన ప్రక్రియలు వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. వ్యయ వివరాల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సింగిల్ నోడల్ ఏజెన్సీ (SNA) ఖాతాల ముగింపుపై సమీక్షించారు. సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ, డ్యాష్‌బోర్డులో నిధుల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆయా శాఖల కార్యదర్శులు తక్షణమే సమీక్షలు నిర్వహించాలని హుకుం జారీ చేశారు.
కేంద్రానికి డీఓ లేఖలు పంపిస్తాం..
కేంద్ర అదనపు కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలని సీఎస్ సంజయ్ జాజు సూచించారు. అవసరమైతే కేంద్రానికి డీఓ లేఖలు పంపిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర కార్యదర్శులతో నేరుగా మాట్లాడతానని చెప్పుకొచ్చారు. తెలంగాణకు రావాల్సిన నిధుల విడుదలకు కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర నిధులు కీలకమని పేర్కొన్నారు. నిధుల సాధనలో ఎలాంటి జాప్యం జరగకూడదని ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టాలని సీఎస్ సంజయ్ జాజు దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తెచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ అభివృద్ధిలో ఎస్పీఎఫ్ పాత్ర కీలకం: భట్టి విక్రమార్క
క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యం: మంత్రి పొంగులేటి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News