ఎప్పుడు ఎన్నికలు జరిగినా కోటి ఓట్లు, 90 సీట్లు సాధిస్తాం: పీసీసీ మహేశ్ కుమార్ గౌడ్
ABN , Publish Date - Nov 23 , 2026 | 01:33 PM
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కోటి ఓట్లు.. 90 సీట్లను తప్పక సాధిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ నెల 26న సంవిధాన్ ర్యాలీని నిర్వహిస్తున్నామని.. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు పాల్గొనాలని ఆయన కోరారు.
హైదరాబాద్, నవంబరు 23: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కోటి ఓట్లు.. 90 సీట్లను తప్పక సాధిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ నెల 26న సంవిధాన్ ర్యాలీని నిర్వహిస్తున్నామని.. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు పాల్గొనాలని ఆయన కోరారు.
గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్ భగవత్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను దేశంలో వేరే ఏ రాష్ట్రాల్లోనూ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ‘కోటి ఓట్లు- తొంభై సీట్లు’ అనే నినాదంతో కాంగ్రెస్ ముందుకు పోతోందని.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. కోటి ఓట్లు, 90 సీట్లను తప్పకుండా సాధిస్తామని ఆయన పేర్కొన్నారు.
కాగా.. ఈనెల 26వ తేదీన లిబర్టీ నుంచి అబిడ్స్ నెహ్రు విగ్రహం వరకు సంవిధాన్ ర్యాలీ నిర్వహిస్తున్నామని.. ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని మహేశ్ కుమార్ గౌడ్ కోరారు. ఆయన ప్రత్యేకంగా నూతన ఏఐసీసీ ఇన్‌చార్జ్ సందీప్ కుమార్‌తో భేటీ కాలేదని.. భేటీ అయ్యాక అన్నీ విషయాల గురించి చర్చిస్తామని మహేశ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇండియన్ రోడ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్: నితిన్ గడ్కరీ
బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం
ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News