Share News

తెలంగాణలో పనిచేయడం సంతృప్తినిచ్చింది: మీనాక్షి నటరాజన్

ABN , Publish Date - Nov 24 , 2026 | 03:33 PM

తెలంగాణలో పనిచేయడం తనకు సంతృప్తినిచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పోస్టు చేశారు.

తెలంగాణలో పనిచేయడం సంతృప్తినిచ్చింది:  మీనాక్షి నటరాజన్
Meenakshi Natarajan

హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పనిచేయడం తనకు సంతృప్తినిచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోలో పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో చాలా విషయాలను నేర్చుకున్నానని పేర్కొన్నారు.


తనకు సహకరించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల కొత్త ఇన్‌చార్జి బీఎం సందీప్‌కు శుభాకాంక్షలు చెప్పారు. సోనియా గాంధీ త్యాగం, కృషి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి కట్టుబడి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 03:56 PM