Share News

గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.. సీఎం రేవంత్‌రెడ్డి నివాళి

ABN , Publish Date - Oct 02 , 2026 | 10:19 AM

జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు.

గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.. సీఎం రేవంత్‌రెడ్డి నివాళి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నేడు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు.

మహాత్మా గాంధీ జీవితం యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకం..

అహింసను ఆయుధంగా, సత్యమే మార్గంగా చేసుకుని కోట్లాది భారతీయుల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింస, సహనం, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి మహోన్నత విలువలను ఆచరించి, వాటి శక్తిని ప్రపంచానికి చాటిన గాంధీ జీవితం యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


జై జవాన్ - జై కిసాన్ నినాదకర్త లాల్ బహదూర్ శాస్త్రి: సీఎం రేవంత్‌రెడ్డి

భారతరత్న, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం నిస్వార్థంగా సేవలందించిన మహోన్నత నాయకుడు అని స్మరించుకున్నారు. ‘జై జవాన్ – జై కిసాన్’ అన్న నినాదంతో సైనికుడి ధైర్యాన్ని, రైతు శ్రమను దేశ ప్రగతికి రెండు బలమైన స్తంభాలుగా చాటిచెప్పిన దార్శనికుడని కొనియాడారు. నిజాయితీ, నిరాడంబరత, కర్తవ్యనిష్ఠ, దేశభక్తికి ప్రతిరూపంగా నిలిచిన వారి జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని సీఎం పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో మహిళ దారుణ హత్య.. పోలీసుల దర్యాప్తు ముమ్మరం

దేశంలో తొలిసారి బినామీ యాక్ట్ కింద మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డితో పాటు 8 మందిపై కేసులు నమోదు

ఫ్లై91 విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 11:01 AM