తెలంగాణలో పెట్టుబడులకు ఎమిరైట్స్ ఆసక్తి.. సీఎం రేవంత్‌రెడ్డితో కీలక చర్చలు
ABN , Publish Date - Jul 11 , 2026 | 05:04 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా ఎమిరైట్స్ వైమానిక సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్ శనివారం సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎంతో చర్చించారు.
హైదరాబాద్, జులై 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని (Telangana CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా ఎమిరైట్స్ (Emirates) వైమానిక సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్ (Mohammed Sarthan) ఈరోజు (శనివారం) సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎంతో చర్చించారు. ఎమిరైట్స్ వైమానిక సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సీఎంను మర్యాదపూర్వకంగా ఎమిరైట్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కలిశారు. హైదరాబాద్‌లో ఎమిరైట్స్ A-38 సర్వీసులను ప్రారంభించేందుకు ఈ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుముఖత వ్యక్తం చేశారు.
ఎమిరైట్స్ విమాన సర్వీసులను మరిన్ని పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. తెలంగాణలో మరో రెండు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో అక్కడ కూడా ఎమిరైట్స్ MRO ఆపరేషన్స్ కొనసాగించాలని సీఎం సూచించారు. విమాన సర్వీసులకు కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్శిటీలో క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు స్పాన్సర్‌షిప్‌నకు ముందుకు రావాలని సీఎం కోరారు. ఈ విషయంపై సానుకూలంగా ఎమిరైట్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్ పాలసీ తెచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీడియా కృషి చేయాలి: గవర్నర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News