CM Revanth Reddy: కేసీఆర్ హయాంలో తెలంగాణకు తీరని అన్యాయం.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:31 PM
సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అండ్ కో తమ ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమానికి నీళ్లే ప్రధాన కారణమని తెలిపారు.
హైదరాబాద్, జనవరి1 (ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అండ్ కో తమ ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమానికి నీళ్లే ప్రధాన కారణమని తెలిపారు. బీఆర్ఎస్ నేతలది సంకుతిత స్వభావమని విమర్శించారు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలోని పదేళ్లలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ(గురువారం) నదీ జలాల అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ ప్రజంటేషన్‌కు హాజరై ప్రసంగించారు సీఎం రేవంత్‌రెడ్డి.
తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వత్తిడి తెస్తున్నామని చెప్పుకొచ్చారు. గతంలో కేసీఆర్, హరీశ్‌రావు చేసిన సంతకాలే తెలంగాణకు మరణశాసనంగా మారాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ నీటి చౌర్యం చేస్తున్న.. తెలంగాణ వాటాను మనం వాడుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల కోసమే జూరాల నుంచి శ్రీశైలానికి ఆ ప్రాజెక్టును మార్చారని మండిపడ్డారు. తలా వదిలేసి తోక దగ్గర నీళ్లు తెచ్చేలా ప్రాజెక్టు డిజైన్ చేశారని విమర్శించారు. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల ఒప్పందాన్ని కేసీఆర్ చేశారని ఆరోపణలు చేశారు. ఏపీకి 66శాతం నీళ్లు శాశ్వత హక్కు వచ్చేలా కేసీఆర్ సంతకం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ నీటి లెక్కలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఈ వార్తలు కూడా చదవండి..
పబ్బులపై ఈగల్ టీం సోదాలు.. డీజేలు అరెస్ట్..
ఆ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్
For More TG News And Telugu News